ఫేస్‌బుక్ లో ప్రేమ‌.. శ్రీ‌లంక నుంచి చెన్నైకి వ‌చ్చిన భామ‌..

March 12, 2020 at 4:52 am

స‌మాచార సాంకేతిక విప్ల‌వం మొద‌ల‌య్యాక మ‌నుషుల జీవితాల్లో చాలా మార్పులు వ‌చ్చాయి. నెట్టింట్లోనే ప్రేమించుకుంటున్నారు. మ‌న‌సుల‌ను ఇచ్చిపుచ్చ‌కుంటున్నారు. అలాగే ఫేస్‌బుక్ ద్వారానే శ్రీ‌లంక‌కు చెందిన యువ‌తికి, త‌మిళ‌నాడు రాష్ర్టం చైన్నైకి చెందిన యువ‌కుడికి లంకె కుదిరింది. దీంతో ఉండ‌బ‌ట్ట‌లేక యువ‌తి ఏకంగా ఎవ‌రికీ చెప్పాకుండా ఇండియాలో వాలిపోయింది. నేరుగా యువ‌కుడు చెప్పిన చిరునామాను వెతుక్కుంటూ వెళ్లింది. చివ‌ర‌కు ఆ ప్రియుడితో ఆమె అదృశ్య‌మైంది. ఇదే విష‌య‌మై యువ‌తి కుటుంబీకులు చైన్నై పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో ఈ సంఘ‌ట‌న వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్లితే..

తమిళనాడు రాష్ర్టం కడలూరు జిల్లా బన్రూట్టి పరిధిలోని వి.ఆండికుప్పానికి చెందిన మహ్మద్ ముబారక్(25) ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి శ్రీలంకలోని రత్నపురా జిల్లాకు చెందిన రిజ్వి ఫాతిమా గుప్తా(21)తో ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇద్దరూ నిత్యం చాటింగ్ చేసుకునేవారు. అలా ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తన ఫేస్‌బుక్ ప్రేమికుడిని చూడాలని రిజ్వీ ఆశపడింది. ఆ విషయాన్ని ప్రియుడికి చెప్పడంతో అందుకు ఆ యువ‌కుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఆ భామా విజిటింగ్ వీసాపై శ్రీలంక నుంచి చెన్నై చేరుకుంది. ప్రియుడిని కలుసుకుని ఆనందంలో మునిగిపోయింది. అతనితోనే ఉండిపోయింది.

ఇదిలా ఉండ‌గా.. యువ‌తి ఇండియాకు వ‌చ్చిన స‌మ‌యంలో ఆమె త‌ల్లిదండ్రులకు ఉపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్ల‌డంతో ఈ విష‌యం వారికి తెలియ‌లేదు. ఇటీవ‌లే బంధువులు ఆమె విష‌యాన్ని చెప్ప‌డంతో ఆమె త‌ల్లిదండ్రులు ఆందోళనకు గుర‌య్యారు. వెంటనే యువతి తండ్రి జైనుల్లా పుదిన్ కూతురిని వెతుక్కుంటూ ఇండియాకి వచ్చాడు. కడలూరు ఎస్పీని కలిసి విషయాన్ని వివ‌రించాడు. దీంతో ఆయన బన్రూట్టి పోలీసులకు రెఫర్ చేశారు. అక్కడికి చేరుకున్న యువతి తండ్రి.. పోలీసులతో కలసి యువకుడి ఊరైన ఆండికుప్పం చేరుకుని ఆరా తీశారు. అయితే వారిద్దరూ అక్కడ కనిపంచకపోవడంతో వారు కంగుతిన్నారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఫేస్‌బుక్ లో ప్రేమ‌.. శ్రీ‌లంక నుంచి చెన్నైకి వ‌చ్చిన భామ‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts