పది సెకన్లు ఆపకుండా గాలి పీల్చగలిగితే కరోనా లేనట్టేనా.. అస‌ల క‌థ ఏంటి..??

March 26, 2020 at 1:11 pm

చైనాలో ఇటీవ‌ల పుట్టుకొచ్చిన‌ కరోనా వైరస్(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ఏ రేంజ్‌లో విస్త‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అంటార్కిటికా తప్ప అన్ని ఖండాలకు ఈ మహమ్మారి విస్తరించింది. ప్రాణాంతకమైన ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది అనడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. జంతువులు తినడం ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని కొందరు.. లేదు.. లేదు.. గాలి ద్వారా వ్యాపిస్తుందని మరికొందరు ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వాస్తవానికి ఈ కొత్త కరోనా వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈజీగా వ్యాపించగలదు.

ఇక ఇప్ప‌టికే ఈ వైర‌స్ బారిన ప‌డి వేల సంఖ్య‌లో ప్రాణాల‌ను కోల్పోయారు. ఇదిలా ఉంటే క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం అనేక ఫేక్ న్యూస్‌లు వైర‌ల్ అవుతున్నాయి. అది గుడ్డిగా న‌మ్మిన ప్ర‌జ‌లు అనేక తిప్ప‌లు ప‌డుతున్నారు. దీంతో ప్ర‌జ‌ల‌కు ఏది న‌మ్మాలి.. ఏది న‌మ్మ‌కూడ‌దు అన్న‌ది అర్థం కావ‌డం లేదు. ఇక తాజాగా పది సెకన్లు ఆపకుండా గాలి పీల్చగలిగితే కరోనా లేనట్టేనా..? అన్న వార్త నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. అయితే కరోనా గురించి ఇది మరో పెద్ద అపోహ అన‌డంతో ఏ మాత్రం సందేహం లేదు.

ఊపిరితిత్తుల సమస్య వల్ల తీవ్రంగా ఇబ్బందిపడేవారిని గుర్తించడానికి ఇలాంటివి కొంతవరకు ఉపయోగిస్తుంటారు. కానీ కరోనా ఇతర వైరస్‌లకంటే భిన్నమైనది. వ్యాధి సోకినా కొన్ని రోజుల వరకు ఎలాంటి ఇబ్బందులు బయటపడని కరోనావైరస్‌ లాంటి వాటిని గుర్తించడానికి ఎలాంటి ఆన్‌లైన్‌ పరీక్షలు ఉపయోగపడవు. ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అనిపిస్తే వైద్యులను సంప్రదించాల్సిందే.

పది సెకన్లు ఆపకుండా గాలి పీల్చగలిగితే కరోనా లేనట్టేనా.. అస‌ల క‌థ ఏంటి..??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts