క‌రోనా ఉందా.. లేదా.. కేవ‌లం ఐదు నిమిషాల్లోనే తెలుసుకోవ‌చ్చు..!!

March 28, 2020 at 2:26 pm

క‌రోనా వైస‌ర్‌(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఇవే మాట‌లు వినిపిస్తున్నాయి. ఈ పేరు వింటేనే అందరి గుండెల్లో గుబులు రేగుతోంది. చైనాలో ఎక్కడో పుట్టిన ఈ వైరస్ ప్రపంచమంతా విస్తరిస్తూ ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఈ మ‌హ‌మ్మారి బారీన ప‌డి ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టికే 25వేల మందికి పైగా మృత్యువాత ప‌డ‌గా.. ఐదు ల‌క్ష‌ల మంది క‌రోనా పాజిటివ్‌తో ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. క‌రోనా వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి ఇప్ప‌టికే చాలా దేశాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి.

అయితే ప్రస్తుతం మన దేశంలో ఏ వ్యక్తిలోనైనా కరోనా వైరస్ ఉందో లేదో తెలుసుకునేందుకు ఒకట్రెండు రోజులు పడుతున్నాయి. కానీ, అబొట్ కంపెనీ ప్రకారం… ఐదు నిమిషాల్లోనే శాంపిల్స్‌ని టెస్ట్ చేసి… కరోనా వైరస్ సోకిందో లేదో నిర్ధారించవచ్చు. ఇక కరోనా నెగటివ్‌ ఫలితాన్ని ఈ కిట్‌ 13 నిమిషాల్లో వెలువరుస్తుందని తెలిపింది. మాలిక్యులర్‌ టెక్నాలజీని ఉపయోగించి చిన్నపాటి టోస్టర్‌ పరిమాణంలో ఉండే పోర్టబుల్‌ టెస్టింగ్‌ కిట్‌ను తయారు చేసింది. అందువల్ల తమ పరికరాన్ని ప్రపంచంలో ఎక్కడైనా వాడవచ్చని అబొట్ తెలిపింది.

ఏప్రిల్ 1 నుంచీ రోజుకు 50000 కరోనా నిర్ధారిత టెస్టులు జరపనున్నట్లు ఈ కంపెనీ తెలిపింది. శాంపిల్‌లో కరోనా వైరస్ జన్యువులు ఉన్నాయో లేదో తమ పరికరం ఐదు నిమిషాల్లో చెప్పేస్తుందని వివరించింది. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇల్లినాయిస్ ఆధారిత అబాట్స్ ఐడి నౌ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది, ప్రస్తుతం యుఎస్‌లో అందుబాటులో ఉన్న అత్యంత సాధారణ పాయింట్-ఆఫ్-కేర్ పరీక్ష, దేశవ్యాప్తంగా 18,000 యూనిట్లకు పైగా విస్తరించి ఉంది. స్ట్రెప్ గొంతు మరియు శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ గుర్తించడానికి ఇది విస్తృతంగా ఉపయోగించబడుతుంది.

క‌రోనా ఉందా.. లేదా.. కేవ‌లం ఐదు నిమిషాల్లోనే తెలుసుకోవ‌చ్చు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts