రూ.ల‌క్షా 50 వేలివ్వండి.. రూ.50వేల జీత‌మొచ్చే ఉద్యోగం పొందండి..

March 10, 2020 at 2:51 am

ప్ర‌భుత్వ ఉద్యోగానికి ఈ రోజుల్లో ఎంత క్రేజ్ ఉందో అంద‌రికీ తెలిసిందే. ఒక్కో పోస్టుకు వేల‌మంది పోటీప‌డుతున్న ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎంతో నిరుద్యోగులు నెల‌ల త‌ర‌బ‌డి ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఉద్యోగ సాధ‌నే ధ్యేయంగా బ‌తుకుతున్నారు. అలాంటి నిరుద్యోగుల ఆశ‌ను క్యాష్ చేసుకుంటున్నారు కొంద‌రు కేటుగాళ్లు. మాయ‌మాట‌లు చెప్పి.. అర‌చేతిలో వైకుంఠం చూపి.. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల‌కు స్వాహా చేసి చివ‌ర‌కు కుచ్చుటోపి పెడుతున్నారు. అలాంటి సంఘ‌ట‌న తాజాగా ఒక‌టి వెలుగు చూసింది. గ‌ల్ఫ్‌లో ఉద్యోగం ఇప్పిస్తాన‌ని చెప్పి ప‌దుల సంఖ్య‌లో నిరుద్యోగుల నుంచి సుమారు రూ.45ల‌క్ష‌ల‌ను వ‌సూలు చేశాడు. ఆపై ప‌త్తాజాడా లేకుండా పోయాడు ఓ మోస‌గాడు. దీంతో బాధితులు ల‌బోదిబో మంటున్నారు. ఈ సంఘ‌ట‌న తెలంగాణ రాష్ర్టం క‌రీంన‌గ‌ర్ జిల్లా జ‌మ్మికుంట‌లో వెలుగుచూసింది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం..

జ‌మ్మికుంట ప‌ట్ట‌ణానికి చెందిన ఓ వ్య‌క్తి ప‌దేళ్ల పాటు గ‌ల్ఫ్‌లో ఓ కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. కొద్దికాలం క్రిత‌మే స్వ‌గ్రామానికి తిరిగివ‌చ్చాడు. అనంత‌రం స్థానిక యువ‌కుల‌కు వ‌ల వేశాడు. ఏసీ రూములు.. వేల‌ల్లో జీతం, ల‌గ్జ‌రీ లైఫ్ అంటూ ఊద‌ర‌గొడుతూ వారికి అర‌చేతిలో వైకుంఠం చూపాడు. గ‌ల్ఫ్‌లో త‌న‌కు తెలిసిన వ్య‌క్తి ఉన్నాడ‌ని, అక్క‌డి ఎయిర్‌పోర్టులో ఉద్యోగం పెట్టిస్తాన‌ని న‌మ్మ‌బ‌లికాడు. అందుకు రూ. ల‌క్షా యాభైవేలు చెల్లించాల‌ని తెలిపాడు. దీంతో ఉద్యోగం వ‌స్తుంద‌నే ఆశ‌తో యువ‌కులు ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఇలా సుమారు 40 మంది వ‌ర‌కు ఆ మోస‌గాడి బుట్ట‌లో ప‌డిపోయారు. త్వ‌ర‌లోనే వీసాలు పంపిస్తాన‌ని చెప్పి ఆ సొమ్ము తీసుకుని తిరిగి గ‌ల్ఫ్‌కు ఊడాయించాడు ఆ కేటుగాడు. అటు త‌రువాత ఎంత‌కూ వీసాలు రాక‌పోవ‌డం డ‌బ్బులు చెల్లించిన యువ‌కులు స్థానికంగా ఉన్న ఆ కేటుగాడి కుటుంబీకుల‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో కొంత మందికి వాట్స‌ప్‌ద్వారా వీసాకాగితాల‌ను పెట్టాడు. వాటిని ప‌రిశీలించి న‌కిలీవ‌ని తేల‌డంతో తాము మోస‌పోయామ‌ని యువ‌కులు గ్ర‌హించారు. అందులో ఒక‌రు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా ఆ కేటుగాడి మోసం బ‌య‌ట‌ప‌డింది. కేసు న‌మోదు చేసుకుని పోలీసులు ద‌ర్యాప్తును చేప‌ట్టారు.

రూ.ల‌క్షా 50 వేలివ్వండి.. రూ.50వేల జీత‌మొచ్చే ఉద్యోగం పొందండి..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts