రామ్ చరణ్ బర్త్ డేకి ఫ్యాన్స్ స్పెషల్ సాంగ్ వ‌చ్చేసింది..!!

March 26, 2020 at 5:33 pm

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బర్త్ డే ఈ నెల 27న కావడంతో మెగా అభిమానులంతా వేడుకలకు సిద్ధమవుతున్నారు. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దని తన అభిమానుల్ని కోరాడు చెర్రీ. వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో గ్రూపులుగా తిరగడం, ఫంక్షన్లు పెళ్లిళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. మరి ఇలాంటి సమయంలో తాను బర్త్ డే వేడుకలు చేసుకోవడం సరికాదని విజ్ఞప్తి చేయ‌డంతో అభిమానులు వెన‌క్కి త‌గ్గారు. అయితే రేపు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా ఓ ప్రత్యేక పాటను కంపోజ్ చేశారు ఆయ‌న అభిమానులు.

రామ్ కొణిదెల బర్త్ డే సాంగ్ ను మధుర ఆడియో రిలీజ్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను తమకు గిఫ్ఠ్ గా ఇచ్చినందుకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖకు ధన్యవాదాలంటూ ప్రారంభయ్యే ఈ వీడియోలో ‘హే అందరి జిందగీ మొత్తం నీ కోసం…’ అంటూ సాగే సాంగ్ లో చెర్రీ ఇంతవరకూ నటించిన చిత్రాలకు సంబంధించి వివిధ గెటప్ లలో ఉన్న పోజ్ లు కనబడతాయి. కాగా, చిరుత సినిమాతో 12 ఏళ్ల కింద ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు మెగా వార‌సుడు.

చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ఈయ‌న తొలి సినిమాతోనే స‌త్తా చూపించాడు. ఆ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ మ‌గ‌ధీర సినిమాతో కేవ‌లం ఒకే ఒక్క సినిమా అనుభ‌వం ఉన్న రామ్ చ‌ర‌ణ్ అప్ప‌టి వ‌ర‌కు ఉన్న 75 ఏళ్ల తెలుగు సినిమా చ‌రిత్ర రికార్డుల‌ను తిర‌గ‌రాసాడు. ఇక ఆ త‌ర్వాత చెర్రీ రికార్డుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టిస్తున్నాడు. కొరటాల శివ-చిరంజీవి ఆచార్య చిత్రంలోనూ రామ్ చరణ్ ఓ ప్రత్యేక పాత్రను పోషించనున్నాడు.

రామ్ చరణ్ బర్త్ డేకి ఫ్యాన్స్ స్పెషల్ సాంగ్ వ‌చ్చేసింది..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts