హైద‌రాబాద్‌లో హైటెక్ వ్య‌భిచారం..?

March 6, 2020 at 3:29 am

ఇటీవ‌ల కాలంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో అసాంఘిక కార్య‌క్ర‌మాలు ఒక‌దాని వెన‌క ఒక‌టి వెలుగు చూస్తున్నాయి. వ్య‌భిచార గృహాల‌ను గుట్టుచ‌ప్పుడు కాకుండా ప‌లువురు నిర్వ‌హిస్తున్నారు. ఇక ప‌బ్బులు సంగ‌తిని చెప్పాల్సిన ప‌ని లేదు. పేరుకు ప‌బ్‌లుగా చ‌లామ‌ణి అవుతూ నిర్వ‌హిస్తూ తెర‌వెన‌క చీక‌టి బాగోతాల‌ను న‌డుపుతున్నాయి. స్పా సెంట‌ర్ల పేర్ల‌తో వ్య‌భిచార దందాను కొన‌సాగిస్తున్నారు కొంద‌రు. మ‌రికొంద‌రు హుక్కా కేంద్రాల పేరుతో మాద‌క‌ద్ర‌వ్యాల‌ను విక్ర‌యిస్తున్నారు. మొన్న‌టికి మొన్న బంజార హిల్స్ ప‌రిధిలో అలాంటి దందానే కొన‌సాగిస్తున్న ఓ ప‌బ్‌పై అధికారులు దాడి చేశారు. ప‌లువురు అరెస్టు కూడా చేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా.. నగరం నడిబొడ్డున అదే బంజార‌హిల్స్ ప‌రిధిలోని కృష్ణాన‌గ‌ర్‌లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న ఒక వ్య‌భిచార ముఠా గుట్టును రట్టు చేశారు హైద‌రాబాద్ పోలీసులు. పక్కా సమాచారంతో దాడులు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ముఠాలో కానిస్టేబుల్ కూడా సభ్యుడిగా ఉండడం పోలీసులను కొస‌మెరుపు. స‌ద‌రు కానిస్టేబుల్ సహా మరో ముగ్గురిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. నివాస గృహాల మ‌ధ్య ఇది కొన‌సాగుతుండ‌డం గ‌మనార్హం. పోలీసులు దీనిపై మ‌రింత లోతుగా విచార‌ణ సాగిస్తున్నారు.

హైద‌రాబాద్‌లో హైటెక్ వ్య‌భిచారం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts