ఆ విష‌యంలో చ‌ర‌ణ్ ఎన్టీఆర్‌ను బీట్ చేస్తాడా..??

March 29, 2020 at 12:55 pm

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం `రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్‌)`. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి మొద‌టిసారి న‌టిస్తుండ‌డంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు, తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. ప్యాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

అయితే ఇటీవ‌ల రామ్ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా రౌద్రం రణం రుధిరం చిత్రం నుంచి స్పెషల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియోలో చెర్రీ తన కండలు తిరిగిన దేహం తప్ప చూపించిందేమీ లేదు. కానీ, ఈ వీడియోకి ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ బాగా క్లిక్ అయింది. మలయాళంలో తప్ప మిగతా నాలుగు భాషలలో ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. ముఖ్యంగా ఎన్టీఆర్ తెలంగాణా యాసలో వాయిస్ ఓవర్‌తో ఓ రేంజ్‌లోకి తీసుకువెళ్లాడు. ఇక‌ ఎన్టీఆర్ లోని ఈ టాలెంట్ కి ఫాన్స్ మురిసిపోవ‌డంతో పాటు ప్ర‌శంస‌లు జ‌ల్లు కురిపిస్తున్నారు.

అయితే చరణ్ ఎంట్రీ అయిపోవడంతో ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వంతు.. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ ఎలా ఉండనున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు. అయితే ఆ టీజర్ లో చరణ్ వాయిస్ ఉంటుందని అనుకోవచ్చు. అప్పుడు చరణ్ ఎంత కష్టపడాలో ఈపాటికే అర్ధమై ఉంటుంది. ఎన్టీఆర్ తో కలిసి నటించడమంటే కచ్చితంగా గట్టి సవాళ్లు ఎదురవుతాయి. అది చరణ్ కి ఆల్రెడీ వచ్చి పడింది. మ‌రి చ‌ర‌ణ్ ఎన్టీఆర్‌ను బీట్ చేస్తాడా.. లేదా.. అన్న‌ది చూడాలి.

ఆ విష‌యంలో చ‌ర‌ణ్ ఎన్టీఆర్‌ను బీట్ చేస్తాడా..??
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts