చైనాలో కరోనా.. జాకీ చాన్ కు తప్పని ముప్పు..!

March 5, 2020 at 1:16 pm

చైనాలో మొదలైన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలని వణికిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ వచ్చిన ఒ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ ని కనిపెట్టారు. ప్రస్తుతం ఆటను ఉస్మానియా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్నాడు. అయితే చైనా నుండి వచ్చిన ఈ వైరస్ అక్కడ ఉన్న స్టార్స్ కు సోకలేదా అన్న డౌట్ రేజ్ అవుతుంది.

చైనా అనగానే అందరికి గుర్తు వచ్చే స్టార్ ఒక్కడే ఆయనే జాకీ చాన్. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. చైనాలో కరోనా విజ్రుంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో జాకీ చాన్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ అందరు అతనికి ఈ వ్యాధి సోకిందా.. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది. జాకీ చాన్ ఎందుకు ఈ వైరస్ గురించి స్పందించలేదు అన్న విషయాలపై ఫోకస్ చేశారు. సోషల్ మీడియాలో ఇదే హాట్ న్యూస్ కాగా ఫైనల్ గా జాకీ చాన్ ఈ వార్తలపై స్పందించారు.

తన మీద చూపిస్తున్న ఈ ప్రేమకు థ్యాంక్స్ అని.. తనకు ఎలాంటి వైరస్ సోకలేదని.. తానూ ఆరోగ్యంగానే ఉన్నానని అన్నారు జాకీ చాన్. జాకీ చాన్ నుండి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి కరోనా ఎఫెక్ట్ తో జాకీ కూడా తన స్పందన తెలియచేసే దాకా ఫ్యాన్స్ హడావిడి చేశారు.

చైనాలో కరోనా.. జాకీ చాన్ కు తప్పని ముప్పు..!
0 votes, 0.00 avg. rating (0% score)