హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి కరోనా.. షాక్ లో ఫ్యాన్స్..

March 16, 2020 at 6:53 pm

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్. చైనా దేశంలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ ఇప్పటికే ప్రపంచంలోని 145 కు పైగా దేశాల్లో పాకి శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ప్ర‌యోజ‌నం లేకుండా పోతుంది. ఇక జేమ్స్‌బాండ్ హీరోయిన్, మోడల్ ఓగ్లా కురిలెంకోకు కూడా కరోనావైరస్ కష్టాలు తప్పలేదు. తాజాగా ఉక్రేయిన్‌కు చెందిన అందాల భామకు పరీక్షలు చేయించుకోగా నావెల్ కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది.

2008లో జేమ్స్‌బాండ్‌ చిత్రం ‘క్వాంటమ్ ఆఫ్ సొలేస్‌’తో పాటు 2013లో విడుదలైన ‘ఒబ్లివియన్’తో ఓల్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే, గత వారం రోజులుగా తాను తీవ్ర జ్వరం, అలసటతో బాధపడుతున్నానని 40 ఏళ్ల ఓల్గా తెలిపింది. వైద్య పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం నా పరిస్థితి అంత అందోళనకరంగా లేదు.

కానీ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంటూ అభిమానులకు సందేశాన్ని పంపింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ను ప్రాణాంతక వ్యాధిగా ప్రకటించిన తర్వాత అంతర్జాతీయంగా ఈ వ్యాధి బారిన పడిన తొలి సెలబ్రిటీగా ఓగ్లా కురిలెంకో పేరు బయటకు వచ్చింది. గత వారం టామ్ హంక్స్, రీటా విల్సన్ దంపతులు కరోనా పాజిటివ్‌గా గుర్తించారు.

హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కి కరోనా.. షాక్ లో ఫ్యాన్స్..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts