ఎన్టీఆర్ జోడిగా ఆ స్టార్ హీరోయిన్ కూతురు …!

March 30, 2020 at 10:00 am

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌నున్నాడు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి సూపర్ హిట్ తర్వాత ఇటీవ‌ల‌ రెండో సినిమా అనౌన్స్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేసవి నుంచి సెట్స్‌పైకి వెళుతుంది.

సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పైనే త్రివిక్రమ్ కసరత్తు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ, శ్రీ‌దేవి కూతురు జాన్వీ కపూర్ ను తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక మరో హీరోయిన్‌‌‌గా పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నాడట త్రివిక్రమ్.

ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. జాన్వీ కపూర్ కూడా కొంత కాలంగా తెలుగు సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతోంది. అందువలన ఈ సినిమాతో ఆమెను తెలుగు తెరకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ వున్నాడని అంటున్నారు. కాగా, దేశం ఎదుర్కొంటున్న వర్ధమాన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

ఎన్టీఆర్ జోడిగా ఆ స్టార్ హీరోయిన్ కూతురు …!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts