క‌రోనా నేప‌థ్యంలో కమల్ హాసన్ ఏం చేశాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!!

March 26, 2020 at 9:04 am

చైనాలో పుట్టిన క‌రోనా వైరస్ ఇపుడు ప్ర‌పంచ‌దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. అంతేకాదు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నాం చేస్తోంది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావాన్ని నివారించ‌డానికి కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు వారాల పాటు లాక్ డౌన్‌ను ప్ర‌క‌టించాయి. ప్ర‌జ‌లు, సెల‌బ్రిటీలంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. సినీ తార‌లు ప‌లువురు క‌రోనా నివార‌ణ కోసం ప‌లు జాగ్ర‌త్త‌లను సూచిస్తున్నారు. మ‌రికొంద‌రు వారికి తొచిన సాయం చేస్తున్నారు.

ఇప్ప‌టికే ఇప్పటికే రజినీకాంత్ తన వంతు సాయంగా రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు సూర్య,కార్తి, విజయ్ సేతుపతి వంటి హీరోలు కూడా తమ వంతుగా రూ.10 లక్షల సాయం ప్రకటించారు. కమల్ హాసన్ పేద కళాకారులను ఆదుకునేందుకు రూ.10 లక్షల విరాళం, హీరో ధనుష్ రూ. 15 లక్షలు, శంకర్ రూ.10 లక్షలను పేద కళాకారులకు విరాళం ప్ర‌క‌టించారు. క‌రోనా నేప‌థ్యంలో తాజాగా క‌మ‌ల్ హాజ‌న్ మ‌రో ముంద‌డుగు వేశారు.

చెన్నైలోని ఎల్డామ్స్ రోడ్ లో ఉన్న తన ఇంటిని తాత్కాలిక ఆసుపత్రిగా మార్చబోతున్నాడు. ఈ విషయమై ఆయన ట్వీట్ చేసారు. నా పార్టీ మక్కల్ నీది మయ్యం లోని వైద్యులతో కలిసి నా ఇంటిని హాస్పిటల్‌గా మార్చాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వం అనుమతించాలని కోరారు. దీంతో క‌మ‌ల్ హాస‌న్‌ను నిర్ణ‌యానికి ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

క‌రోనా నేప‌థ్యంలో కమల్ హాసన్ ఏం చేశాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts