కనికా కపూర్‌‌ ఆరోగ్యం విషమం.. ఆందోళ‌న‌లో కుటుంబ‌స‌భ్యులు..!!

March 29, 2020 at 5:31 pm

క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19 ప్ర‌పంచ‌దేశాల‌ను చుట్టేసి.. ప్ర‌జ‌ల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురిచేస్తుంది. చిన్నా, పెద్దా, పేద‌వాడు, ధ‌నికుడు అని తేడా లేకుండా అంద‌రినీ గ‌డ‌గ‌డ‌లాడిస్తుంది క‌రోనా. అయితే ఇటీవ‌ల బాలీవుడ్ గాయని కనికా కపూర్ క‌రోనా వైర‌స్ సోకిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించడంలేదు.

నాలుగోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో కూడా ఆమెకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిపై ఆమె కుటుంబ సభ్యులొకరు మాట్లాడుతూ… ‘‘రిపోర్టులను చూసి మేం తీవ్ర ఆందోళనలో మునిగిపోయాం. డాక్టర్లు చేసే చికిత్సకు కూడా ఆమె స్పందించడం లేదు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉన్న కారణంగా మెరుగైన చికిత్స కోసం ఆమెను విమానాల్లో కూడా తరలించడానికి కూడా సాధ్యం కావడం లేదు. దేవుడ్ని ప్రార్థించడం తప్ప మరో మార్గమేమీ మాకు కనిపించడం లేదు’’ అని కుటుంబ సభ్యులు అవేద‌న వ్య‌క్తం చేశారు.

కాగా, మార్చి 9న లండన్‌ నుంచి వచ్చిన కనికా కపూర్‌ ఉత్తర ప్రదేశ్‌లోని హోటల్‌లో బస చేసింది. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు. ఆమెకు కరోనా సోకినట్లు తేలడంతో సంచలనం రేగింది.. దాంతో పాటు ఆమెను కలిసిన వాళ్లను కూడా సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి పంపించారు. అలాగే నిర్లక్షపూరితంగా వ్యవహారించారనే ఆరోపణలపై లక్నో మెడికల్ కాలేజీ హాస్పిటల్ చీఫ్ మెడికల్ డాక్టర్ ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

కనికా కపూర్‌‌ ఆరోగ్యం విషమం.. ఆందోళ‌న‌లో కుటుంబ‌స‌భ్యులు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts