క‌రోనా క‌ల్లోల‌మ్ తో కెసిఆర్ యాక్షన్ ప్లాన్…!

March 26, 2020 at 1:07 pm

ట్యాంక్ బండ్ రోడ్‌లో కెమిక‌ల్స్ చ‌ల్లిన తెలంగాణ ప్ర‌భుత్వ సిబ్బంది. ఉద‌యం ఆరు గంట‌ల నుండి మ‌ధ్యాహ‌న్నం రెండు గంట‌ల వ‌ర‌కు మొద‌టి షిఫ్ట్‌. అలాగే రెండ‌వ ష‌ఫ్ట్ ఇలా ష‌ఫ్ట్‌ల వారీగా ప‌ని మందును చ‌ల్ల‌డం జ‌రుగుతుంది. ఇక ప్ర‌జ‌ల‌కు కావ‌ల‌సిన అత్య‌వ‌స‌ర‌, నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌ను కూడా అందుబాటులో ఉండే సౌక‌ర్యాలు ప్ర‌భుత్వం చేస్తుంది. కాబ‌ట్టి ఎవ్వ‌రూ కూడా ఇష్టం వ‌చ్చిన‌ట్లు బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచిస్తుంది. అలాగే ఎవ్వ‌రూ టెన్ష‌న్ ప‌డ‌కండి అని చెబుతుంది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చెప్పిన‌ట్లు 21రోజుల పాటు లాక్ డౌన్ చెయ్య‌డం మంచిది అని అంటున్నారు. ప్ర‌జ‌లంద‌రూ ఈ విష‌యం పైన పాల్గొనాలి బ‌య‌ట‌కు రావ‌ద్దు అని చెబుతున్నారు. ఎక్క‌డా కూడా పార‌శుద్ధ్యానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూస్తామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చెబ‌తుంది. అలాగే గాంధీ ఆసుప‌త్రిలో ప్ర‌తి వార్డును ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌తిప్ర‌తినిధులు చెక్ చేస్తూ వ‌స్తున్నారు.

అలాగే న‌ల్గొండ‌లో కూడా ప‌రిశుభ్ర‌తా చ‌ర్య‌లు చెప‌ట్టారు. మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు. ఈ విధంగా మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ఎక్క‌డిక‌క్క‌డ పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాము అని ఆయ‌న సూచించారు. అదే విధంగా డ్ర‌యినేజ్‌ల‌కి సంబంధించి స్ప్రే చేయిస్తామ‌న్నారు. బ్లీచింగ్ పౌడ‌ర్‌ని కూడా చ‌ల్లుతూ ఎప్ప‌టిక‌ప్పుడు శానిటైజేష‌న్ జ‌రుపుతూ ఉన్నాం. క‌మీష‌న‌ర్‌గారు, ఆర్డీఓగారు ప‌ట్ట‌ణంలోని అన్ని ప్ర‌దేశాలు తిరిగి మ‌రీ త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. అలాగే కూర‌గాయ‌ల మార్కెట్‌కి కూడా ఉద‌యం 5 గంట‌ల‌కే విజిట్ అయి అక్క‌డ ప‌రిస‌రాలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెక్ చెయ్య‌డం జ‌రిగింది. అలాగే ఎవ‌రైనా అధిక ధ‌ర‌ల‌కు అమ్మితే వారి దుకాణాల‌కు సీజ్ చేసి యాక్ష‌న్ తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం అన్నారు. అలాగే ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డుని కూడా విసిట్ చేసిచెక్ చేయ‌డం జరిగింది అన్నారు. ఎవ‌రైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళ‌ని తీసుకుని వ‌చ్చి గ‌వ‌ర్న‌మెంట్ ఆసుప‌త్రిలో ఉంచ‌డం జ‌రిగింది అని అన్నారు. ఎక్క‌డ ఏమాత్రం ఎవ‌రిమీదైనా ఏ అనుమానం ఉన్నా కూడా వెంట‌నే ప‌రిక్ష‌లు జ‌రుపుతున్నాము అన్నారు.

క‌రోనా క‌ల్లోల‌మ్ తో కెసిఆర్ యాక్షన్ ప్లాన్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts