రొమాంటిక్ భామకి 100ప‌ర్సంట్ న్యాయం జ‌రుగుద్దా?

March 16, 2020 at 3:49 pm

క్రేజీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం రొమాంటిక్‌. మ‌రి ఈ చిత్రంలో ఆకాష్ పూరి స‌ర‌స‌న ఢిల్లీ బ్యూటీ కేతిక శ‌ర్మ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్ర పోస్ట‌ర్ ను ఇటీవ‌లె విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల్లో మ‌రింత క్రేజ్ పుట్టించారు. చిత్ర యూనిట్‌. ఇక ఆ పోస్ట‌ర్‌లో కేత‌కి శ‌ర్మ యంగ్ హీరో ఆకాష్‌ని టాప్‌లెస్‌గా హ‌త్తుకునే స్టిల్ కుర్రాళ్ళ‌ను రెచ్చ‌గొట్టేలా ఉంది. ఇక పోస్ట‌రే ఇంత‌లా ఉంటే సినిమాలో పూరి రొమాన్స్‌ని ఇంకెంత‌లా చూపించి ఉంటారా అని కుర్రాళ్ళా ఈ చిత్రం కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ భామ యూత్ కి క్రేజీ హీరోయిన్‌గా మారింది.

ఇక ఈ చిత్రం ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌ల కాక‌ముందే నే ఈ అమ్మడు సెకెండ్ ఛాన్స్ కొట్టేయ‌డం అనేది హాట్ టాపిక్ గా మారింది. మ‌రో యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సుకుమార్ సహాయకుడు కాశీ విశాల్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగశౌర్యకి జోడీగా కేతిక శర్మని ఎంపిక చేసార‌ట‌. నేటి తరం నాయికల కు మధ్య గట్టి పోటీగా మారింది ఈహీరోయిన్‌. రొమాంటిక్ రిలీజ్ కాకుండానే అప్పుడే సెకెండ్ ఛాన్సా? అంటూ కొంత మంది అవాక్కవుతున్నారు. శౌర్య చిత్రాన్ని సుకుమార్-శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెర‌కెక్క‌బోతుంద‌ట‌.

మరి శౌర్య- కేతిక జంట కోసం 100 పర్సంట్ రొమాంటిక్ స్క్రిప్టును సుకుమార్ సిద్ధం చేస్తున్నాడ‌ని స‌మాచారం. ఇక‌ కాశీ విశాల్ క్రియేటివిటీ రేంజ్ ఎంత? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సుకుమార్ ఉప్పెన సినిమాకు స్క్రిప్ట్ అందించి సహ నిర్మాతగా వ్యవరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సుక్కూ శిష్యుడు.. ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు.

రొమాంటిక్ భామకి 100ప‌ర్సంట్ న్యాయం జ‌రుగుద్దా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts