శాక్రిఫైజ్ స్టార్‌కు ఝలకిచ్చిన బ్యూటీ

March 17, 2020 at 6:08 pm

గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న శాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ గురించి ఇప్పుడు దాదాపు అందరికీ తెలిసి ఉండవచ్చు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1-నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో వంటి సినిమాల్లో తొలుత తానే నటించానని, ఆ తరువాత స్టార్ హీరోలైన మహేష్, ఎన్టీఆర్ ఆ ఆఫర్లు కొట్టేశారంటూ ఫిర్యాదు చేసిన సునిశిత్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు.

అంతేగాక తనకు టాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసిన అతడు, టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠీని సీక్రెట్‌గా వివాహం చేసుకుని, కొంత కాలం తరువాత విడిపోయానంటూ బాంబ్ పేల్చాడు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాలు షేక్ అయ్యాయి. అసలు ఈయనగారి కథ ఏమిటో తెలుసుకునే పనిలో పడ్డారు. అలా ఈ వార్తలు కాస్త లావణ్య త్రిపాఠీ వరకు చేరడంతో ఆమె అవాక్కవ్వడమే కాకుండా తక్షణమే చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యింది.

తాజాగా సునిశిత్‌పై లావణ్య సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి అతడిపై వేధింపుల కేసు నమోదు చేసింది. తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్నాడంటూ ఆమె ఫిర్యాదులో తెలిపింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నట్లు తెలిపారు.

శాక్రిఫైజ్ స్టార్‌కు ఝలకిచ్చిన బ్యూటీ
0 votes, 0.00 avg. rating (0% score)