అత‌నికి 19 ఏళ్లు.. ఆమెకు 45 ఏళ్లు..

March 6, 2020 at 4:49 am

స్ర్తీ, పురుష సంబంధాలకు కాలం చెల్లుతున్న‌ట్లుగా ఉన్న‌ది. గ‌తంలో స‌మ‌వ‌య‌స్కులు ప్రేమ‌లో ప‌డేవారు. లేదంటే వివాహేత‌ర సంబంధాల‌ను నెరిపేవారు. కానీ ప్ర‌స్తుతం ఆ తార‌త‌మ్యం లేకుండా పోతున్న‌ది. పెద్ద‌వారితో.. చిన్న‌వారు.. లేదంటే చిన్నారులే త‌మ‌కంటే పెద్ద‌వారితో అక్ర‌మ సంబంధాల‌ను పెట్ట‌కుంటున్నారు. ఇప్ప‌టికే ఇలాంటి సంఘ‌ట‌న‌లు అనేకం వెలుగు చూశాయి. తాజాగా ఇలాంటి సంఘ‌ట‌నే మ‌రొక‌టి క‌ర్నాట‌క రాష్ర్టం రాయ‌చూరులో వెలుగుచూసింది. పోలీసులు, బాధితులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

కర్నాట‌క రాష్ర్టం రాయచూరుకు చెందిన నిర్మ‌ల అనే మ‌హిళ ఆటోడ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న‌ది. ఆమెకు ఒక కుమారుడు న‌రేష్ (19). ఆ యువ‌కుడు స్థానిక మ‌హ‌బ‌లేశ్వ‌ర్ స‌ర్కిల్ వ‌ద్ద ఉన్న ఉడిపి హోట‌ల్‌లో పనిచేస్తున్నాడు. అదే హోట‌ల్‌లో చంద్రిక అనే వివాహిత (45) ప‌నిచేస్తున్న‌ది. ఆమెకు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. ఇదిలా ఉండ‌గా, ఆ యువ‌కుడికి, స‌ద‌రు మ‌హిల‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. కొంత కాలంగా అక్ర‌మ సంబంధం కొన‌సాగుతున్న‌ది. ఈ నేప‌థ్యంలో వారం రోజులుగా వారిద్ద‌రూ క‌నిపించ‌కుండా పోయారు. దీంతో యువ‌కుడి త‌ల్లి నిర్మ‌ల పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. చంద్రిక తన కొడుక్కి మాయమాటలు చెప్పి ఎక్కడికో తీసుకెళ్లిందని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇదే విష‌య‌మై ఆ వివాహిత భర్త లోకేష్‌ను సంప్ర‌దించ‌గా తనకేమీ తెలియదని చెబుతున్నాడని యువ‌కుడి త‌ల్లి నిర్మ‌ల తెలిపింది.

అత‌నికి 19 ఏళ్లు.. ఆమెకు 45 ఏళ్లు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts