గ్రామ సచివాలయ ఉద్యోగిని, వాలంటీర్ ఆత్మహత్యాయత్నం ..ఎక్కడంటే ?

March 3, 2020 at 1:10 pm

ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమించిన వారికోసం ఏమైనా చేస్తారు. ఇంట్లో వారికి రూపాయి ఖర్చుచెయ్యడం ఇష్టపడనివారు సైతం ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతైనా దారపోస్తారు. కారణం వారిలో ఉన్నది స్వార్దం తో కూడిన ప్రేమ మాత్రమే. ఈ క్ర‌మంలోనే తాను ఇష్టపడిన అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తారు. వారి కోసం అప్పు చేసైనా వారు కోరింది ఇస్తారు. కానీ అదే ప్రేమను ఎదుటి వారు తిరస్కరిస్తే అస్సలు ఓర్చుకోరు. అవసరమైతే తనకు దక్కనిది ఎవరికి దక్క కూడదనే ఉద్దేశ్యంతో తాము ప్రాణాధికంగా ప్రేమించిన వరినే మట్టుబెడతారు. ఇక తాజాగా అనంత‌పురం జిల్లాలోనూ అదే జ‌రిగింది.

అనంతపురం జిల్లాలో ఓ గ్రామ సచివాలయ ఉద్యోగిని, వాలంటీర్ కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా గోరంట్ల ఆర్కే వీధికి చెందిన వేణు గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. వేణు సచివాలయ ఉద్యోగి ఉషను ప్రేమించి తనను ప్రేమించాలని కోరాడు. ఉష మాత్రం అతని ప్రేమను తిరస్కరించింది.

దీంతో మనస్థాపం చెందిన వేణు.. ఉష‌ను మాట్లాడలంటూ పిలిచాడు. ఆ వెంటనే తనతో తెచ్చుకున్న పురుగులమందు తాగి ఆమెకు కూడా బలవంతంగా నోట్లో పోశాడు. అపస్మారక స్థితిలో ఉన్న వేణు, ఉషను స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఇక ఇద్దరిలో వేణు పరిస్థితి మ‌రింత ఆందోళనకరంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం హిందూపురం తరలించారు. దీంతో విష‌యం తెలుసుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

గ్రామ సచివాలయ ఉద్యోగిని, వాలంటీర్ ఆత్మహత్యాయత్నం ..ఎక్కడంటే ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts