తెలుగు రాష్టాల సీఎం రిలీఫ్ ఫండ్ కు మహేష్ భారీ విరాళం….!!

March 26, 2020 at 4:14 pm

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవాళిని కుదిపేస్తున్న కరోనా వ్యాధి ప్రభావంతో ఇప్పటికే చాలా దేశాలు లాకవుట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యాధిని మరింతగా ప్రబలకుండా చేసేందుకు ప్రజలు ఎవరికి వారు సోషల్ డిస్టెన్స్ పాటించడమే దీని నివారణకు మంచి మార్గమని భావించి, ప్రధాని మోడీ, మొన్న ఏకంగా 21 రోజుల పాటు భారతదేశాన్ని లాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ, దీని ప్రభావంతో మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన అనేకమంది ప్రజలు పనులు లేక ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడడం, తద్వారా వారి పోషణ కష్టం అవుతోంది.అయితే అందుకోసం ఇప్పటికే కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత మేర ఆర్ధిక సాయాన్ని ప్రకటించగా, మరోవైపు తమ వంతుగా సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా కొంత మొత్తాన్ని సాయంగా ప్రకటించి తమ గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తంగా రూ.2 కోట్ల విరాళం ప్రకటించగా, రామ్ చరణ్ రూ.70 లక్షలు, నితిన్ రూ.10 లక్షలు, దర్శకులు త్రివిక్రమ్ రూ.20 లక్షలు, అనిల్ రావిపూడి రూ.10 లక్షలు, వివి వినాయక్ రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు.

ఇకపోతే కాసేపటి క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు తనవంతుగా రూ.1 కోటి విరాళం ప్రకటించడం జరిగింది. అంతేకాక ఇటువంటి పరిస్థితుల్లో ఆర్ధికంగా మనవంతుగా సాయం అందిస్తే, అది సమస్యల్లో ఉన్నవారికి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని మహేష్ ఒక ట్వీట్ చేస్తూ తెలిపారు. అలానే కరోనా వ్యాధి ప్రబలకుండా ఆరు రకాల సూత్రాలు పాటించాలని మహేష్ బాబు నిన్న చేసిన ట్వీట్ చేయడం జరిగింది. ఇక నేడు మహేష్ విరాళం ప్రకటించడంతో సర్వత్రా ఆయన పై పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి…..!!

తెలుగు రాష్టాల సీఎం రిలీఫ్ ఫండ్ కు మహేష్ భారీ విరాళం….!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts