సోష‌ల్ మీడియాలో దుమ్ము దుల‌ప‌డానికి రెడీ అవుతున్న చిరు..!!

March 24, 2020 at 3:30 pm

చిరంజీవి…ఎప్పటికయినా,ఎన్నాళ్లయినా టాలీవుడ్‌లో మెగాస్టార్ అనే పేరు, ఆ స్థానం ఆయనకే సొంతం. 1970వ ద‌శ‌కంలో చెన్నైలోని ఓ యాక్టింగ్ స్కూల్లో మొద‌లైన ఈయ‌న ప్ర‌యాణం ఇప్ప‌టికీ సాగుతూనే ఉంది. సుప్రీమ్ హీరోగా మొదలై.. మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి ప్రయాణం ఈ తరం నటులకు ఆదర్శం. ఇక దాదాపు పదేళ్ళ విరామం తీసుకుని మళ్ళీ సినిమా తీసినా కూడా థియేటర్స్‌లో అదే విజిల్స్ మోత, బాక్సాఫీస్ దగ్గర అదే రికార్డులు ఊచకోత.

తెలుగు సినిమాకు రికార్డులు అంటే ఎలా ఉంటాయో చూపించిన ఈయ‌న‌.. గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటీనటులు అయితే ఆయన సినిమాలో నటించాలని ఎదురుచూస్తుంటారు. ఒక్కసారి అయినా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటది. ఇదిలా ఉంటే.. చిరంజీవి తన అభిప్రాయాలను మరింత బలంగా వినిపించడం కోసం సోషల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. వాస్త‌వానికి ఇప్పటివరకు చిరంజీవికి సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి ఖాతాలు లేవు.

ఎప్పుడైనా సందేశం ఇవ్వాలంటే వీడియో రూపంలో వెలువరించేవారు. అయితే ఇకపై ఆయన ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవాలని డిసైడ్ అయ్యారు. అందుకు ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నారు. రేపు ఉగాది పర్వదినం సందర్భంగా అభిమానులతో చిరంజీవి లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఇక ఏదేమైనా చిరు సోష‌ల్ మీడియాలో దుమ్ము దుల‌ప‌డానికి రెడీ అయ్యార‌న్న‌మాట‌.

సోష‌ల్ మీడియాలో దుమ్ము దుల‌ప‌డానికి రెడీ అవుతున్న చిరు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts