సూప‌ర్‌స్టార్‌పై మెగాస్టార్ అసంతృప్తి..!

March 14, 2020 at 5:08 am

తెలుగులో మల్టీస్టారర్ సినిమాలకు ఇప్పుడిప్పుడే అడుగులు ప‌డుతున్నాయి. అగ్ర హీరోలు కూడా త‌మ ఇగోలు.. ఇమేజ్‌ల‌ను పక్కనబెట్టి కలిసి నటించేందుకు ముందుకు వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు క‌లిసి న‌టిస్తున్నారు. అంత‌కు ముందు వెంక‌టేశ్‌, మ‌హేశ్‌బాబు, శ్రీ‌కాంత్ త‌దిత‌రులు కూడా సినిమాలు చేశారు. ఇటీవ‌లే మ‌రోసారి సూపర్ స్టార్ మ‌హేష్‌, మెగాస్టార్ చిరంజీవి కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తున్న‌ద‌నే ప్ర‌చారం జోరుగా సాగింది. కానీ దానికి ఆదిలో ఎదురుదెబ్బ ప‌డిన‌ట్లు తెలుస్తున్న‌ది. కొరటాల శివ దర్శకత్వంలో ప్ర‌స్తుతం చిరు న‌టిస్తున్న ఆచార్య‌ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేగంగా జరుగుతున్న‌ది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ తో రామ్ చరణ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే చిత్రంలో కొరటాల కోరిక మేరకు గెస్ట్ రోల్ చేసేందుకు మహేష్ బాబు ఒప్పుకున్నాడు. దీనిపై అటు ప్రిన్స్‌, ఇటు మెగా అభిమానులు పండ‌గ చేసుకున్నారు.

ఇదిలా ఉండ‌గా.. మ‌హేశ్ రాక‌పై చిరంజీవి మాత్రం మొద‌టి నుంచీ అసంతృప్తిగానే ఉన్నట్లు స‌మాచారం. ఎందుకంటే ప్రిన్స్ త‌న పాత్ర కోసం 30 రోజుల డేట్స్ ఇచ్చి ఏకంగా 30 కోట్లు కూడా అడిగాడట‌. దీంతో అన్ని కోట్లు ఇచ్చి మహేష్ బాబును తీసుకోవడం వల్ల తన సినిమాకు ఎక్స్ ట్రా లాభం ఉంటుందా? అని లెక్కలు వేసుకున్న చిరు అటు తర్వాత మహేశ్‌ పాత్రపై ఓ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ప్రిన్స్‌ను ప‌క్క‌న పెట్టి చరణ్ తోనే ఆ పాత్ర చేయించ‌డానికి సిద్ధ‌మై పోతున్నాడ‌ట మెగాస్టార్‌. అయితే రెమ్యునరేషన్ కారణంగా ఈ చిత్రం నుంచి మహేష్‌ను చిరంజీవి తప్పించినట్లు తెలుస్తున్న‌ది. చరణ్ తో కలిసి నటిస్తే కచ్చితంగా సినిమా రేంజ్ పెరుగుతుందని చిరు భావిస్తున్నట్లు టాలివుడ్ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. అందుకే రాజమౌళి నుంచి పర్మిషన్ తెచ్చుకునే పనిలో నిమ‌గ్న‌మ‌య్యాడ‌ట చరణ్. అన్నీ కుదిరి అగ్ర‌హీరోలు క‌లిసి సినిమాలు చేసేందుకు ఇప్పుడిప్పుడే మందుకు వ‌స్తుండ‌గా ఈ రెమ్యునరేషన్ దగ్గరే పీట ముడి ప‌డుతుండ‌డంతో అభిమానులు మాత్రం నిరుత్సాహానికి గుర‌వుతున్నారు.

సూప‌ర్‌స్టార్‌పై మెగాస్టార్ అసంతృప్తి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts