ఏడో త‌ర‌గ‌తిలోనే మైన‌ర్ల పెళ్లి.. సోష‌ల్ మీడియాలో లొల్లి

March 12, 2020 at 4:32 am

రోజులు చాలా మారాయి. స్కూల్ డేస్ నుంచే ప్రేమ వ్య‌వ‌హారాలు మొద‌లవుతున్నాయి. విద్యార్థి ద‌శ‌లోనే కొంద‌రు ప్రేమ పాఠాల‌ను నేర్చుకుంటున్నారు. ఇంకొంద‌ర‌యితే శృంగార పాఠాల‌ను కూడా ఒంట‌ప‌ట్టించుకుంటున్నారు. తాజాగా ఓ ఇద్ద‌రు మైన‌ర్లు ఏకంగా ఇంటి నుంచ పారిపోయి పెండ్లి చేసుకున్నారు. అక్క‌డితో ఆగ‌కుండా అందుకు సంబంధించిన చిత్రాల‌ను సోష‌ల్‌మీడియాలో పెట్టారు. ఏముంది ఇప్పుడ‌వి తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. దీనిపై నెటిజ‌న్లు లొల్లి లొల్లి చేస్తున్నారు. కామెంట్ల మీద కామెంట్లు గుప్పిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ర్టం ములుగు మండ‌లంలోని కొడిశాల‌కుంట గ్రామానికి చెందిన ఓ బాలిక వ‌రంగ‌ల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం ఆశ్రమ పాఠశాలలో ఏడో త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ది. బాలిక‌కు దుగ్గొండి మండ‌లం మ‌ల్లంప‌ల్లి గ్రామానికి చెందిన ఓ బాలుడితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇద్ద‌రు ప్రేమించుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో బాలిక ఈ నెల 7వ తేదీన హాస్ట‌ల్ నుంచి అదృశ్య‌మైంది. దీంతో నిర్వాహ‌కులు ఆమె త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండ‌గా తాజాగా స‌ద‌రు బాలిక, బాలుడిని వివాహం చేసుకుని సంబంధిత ఫొటోల‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. పసుపుతాడు కట్టించుకుని ప్రియుడితో దిగిన ఆ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు వారి అచూకీ కోసం గాలింపు చేప‌ట్టారు.వారు ఎక్క‌డున్నారనేది తెలుసుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఏడో త‌ర‌గ‌తిలోనే మైన‌ర్ల పెళ్లి.. సోష‌ల్ మీడియాలో లొల్లి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts