ఏపీలో మూడు రాజధానులపై మోడీ తాజా కామెంట్స్ !

March 17, 2020 at 6:16 pm

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా అమరావతిని శాసనరాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కొనసాగించాలని నిర్ణయించారు. దీనిని విపక్ష టీడీపి వ్యతిరేకిస్తున్నది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మరోవైపు పలు గ్రామాల రైతులు కూడా నిరసనలను చేపడుతున్నారు. జగన్ కు మద్దతుగా కొన్ని దళిత సంఘాలు దీక్షలను చేస్తున్నాయి. ఈ. అంశంపై ఇప్పటి వరకు మోడీ ఒక్కసారి కూడా స్పందించలేదు. కాని తాజాగా ప్రధాని తొలిసారిగా రాజధాని అంశాన్ని ప్రస్తావిఐచారు.

ఏపీ టీడీపీ ఎంపీ కనకమేడల ఇటీవల ప్రధానికి ఓ లేఖను రాశారు. మూడు రాజధానుల ఏర్పాటుపై స్పందించాలని కోరారు. మూడు రాజధానుల వల్ల ఏపీ తీవ్రంగా దెబ్బతింటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దానిపై సరైన నిర్ణయం తీసుకోవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎంపి రాసిన లేఖపై పీఎం స్పందించారు. ఆ లేఖ తమకు అందిందని, దానిని పరిశీలిస్తున్నామని వివరించారు. అయితే ఇంతకు ఎన్నిసార్లు డిమాండ్ చేసిన మూడు రాజధానుల అంశంపై నోరుమెదపని మోడి ఇప్పుడు ఎంపీ లేఖపై స్పందిచడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో మూడు రాజధానులపై మోడీ తాజా కామెంట్స్ !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts