టాలీవుడ్ హీరోయిన్ని బాగా ఇబ్బంది పెట్టిన నిర్మాత ..!!

March 17, 2020 at 6:46 pm

నభా నటేష్‌.. పూరి జగన్నాథ్, రామ్ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో చాందిని పాత్రలో నటించి ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో రామ్ స్పీడ్‌కు ఎక్కడా తగ్గకుండా అదిరిపోయే నటనతో పాటు అందచందాలతో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింది ఈ కన్నడ భామ‌. ప్ర‌స్తుతం ఈ ఇస్మార్ట్ పోరి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోశ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో న‌టిస్తోంది. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌ పతాకంపై సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మిస్తున్నారు.

కుటుంబ విలువలకు వినోదాన్ని జోడిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. అయితే క‌రోనా కార‌ణంగా నిర్మాత‌ల మండ‌లి సినిమా షూటింగ్స్‌ను కొన్నిరోజుల పాటు వాయిదా వేసుకోవాల‌ని సూచించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చాలా సినిమాలు షూటింగ్‌ను వాయిదా వేసుకున్నాయి. కానీ, అల్లుడు అదుర్స్ సినిమా షూటింగ్ మాత్రం వాయిదా వేయ‌లేదు.

అందుతున్న విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌స‌మాచారం ప్ర‌కారం.. నిర్మాత బెల్లంకొండ సురేష్ యూనిట్‌తో సినిమా షూటింగ్‌ను కంటిన్యూ చేయాల‌ని కోరార‌ట‌. అంతే కాకుండా హీరోయిన్ న‌భా న‌టేశ్‌ను బెంగ‌ళూరు నుండి హైద‌రాబాద్‌కు ర‌మ్మ‌ని గ‌ట్టిగా చెప్పార‌ట‌. ఇండ‌స్ట్రీ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నాన‌ని తెలిసినా.. ఏం చేయ‌లేక‌ న‌భా న‌టేశ్‌ ప్రొఫెష‌న‌ల్‌గా షూటింగ్‌లో పాల్గొంటుంద‌ని తెలుస్తోంది.

టాలీవుడ్ హీరోయిన్ని బాగా ఇబ్బంది పెట్టిన నిర్మాత ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts