సాయి పల్లవి ముందు తేలిపోయిన అక్కినేని హీరో

March 16, 2020 at 1:36 pm

ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘లవ్ స్టోరి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ మొదలు రీసెంట్‌గా రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ వరకు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాలోని సాంగ్స్ షూటింగ్‌లో సాయి పల్లవి తనదైన మార్క్ చూపిస్తోందట. సాంగ్స్‌ షూట్‌లో సాయి పల్లవి చేస్తున్న డ్యాన్స్ స్టెప్పులను నాగచైతన్య చేయలేకపోతున్నా్డట. డ్యాన్స్ మాస్టర్లు చెప్పే స్టెప్పులు వేయడానికి చైతూ ఏకంగా 20 టేకులకుపైగా తీసుకుంటున్నాడట. దీంతో చిత్ర యూనిట్ సాయి పల్లవి డ్యాన్స్ స్టెప్పులకు చప్పట్లు కొడుతున్నారట.

ఇంతటి స్థాయిలో సాయి పల్లవి డ్యాన్స్ చేస్తుందని తాము అనుకోలేదని చిత్ర యూనిట్ అంటోంది. మొత్తానికి సాయి పల్లవి డ్యాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను షాక్ అయ్యేలా చేస్తుందనడంలో మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ కానుంది. ఇక ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నాడు. వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

సాయి పల్లవి ముందు తేలిపోయిన అక్కినేని హీరో
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts