పూజా హెగ్డే కి నాగ‌చైత‌న్య థ్యాంక్యూ ఎందుకంటే?

March 25, 2020 at 4:07 pm

అక్కినేని ఫ్యామిలీ తో తెరకెక్కించిన `మనం` చిత్ర ద‌ర్శ‌కుడు విక్రమ్ కుమార్ ఆచిత్రంతో అద్భుతమైన సక్సస్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి అక్కినేని ఫ్యామిలీ జీవితకాలం చెప్పుకునేంత తిపి గుర్తుని ఇచ్చాడ‌నే చెప్పాలి. ఇక అక్కినేని నాగేశ్వర రావు ఆఖరి సినిమా కూడా మనం కావడం విశేషం. ఈ సినిమా తర్వాత మళ్ళీ విక్రమ్ కుమార్ అక్కినేని హీరోల తో సినిమా చేయ‌లేదు. మనం తర్వాత చేసిన సినిమాలన్ని వరుసగా ఫ్లాప్ అవ్వ‌డంతో ఈ సారి చైతూ తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాలన్న కసితో ఉన్నాడట. ఇక సినిమా వాళ్ళ సెంటిమెంట్స్ గురించి ప్ర‌త్యేకించి చెప్పేదేముంది.

ఇదిలా ఉంటే…తాజా సమాచారం ప్రకారం ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ అక్కినేని నాగ చైతన్య కోసం ఓ కథని సిద్ధం చేశాడని ఈ మధ్య ఒక వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ ను హీరో నాగ చైతన్యకు వినిపించగా కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిట్లు లేటెస్ట్ అప్‌డేట్. అయితే ఇంటర్వెల్ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాల్లో చిన్న మార్పులు చెప్ప‌గా.. ప్రస్తుతం దర్శకుడు అదే పనిలో ఉన్నాడట.

ఇక ప్రస్తుతం నాగచైతన్య శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో చైతూ కి జంటగా ఫిదా బ్యూటి సాయి పల్లవి నటిస్తుంది. ఇటీవల రిలీజైన పోస్టర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విక్రమ్ కుమార్ చైతూ తో తెరకెక్కించబోయో సినిమాకి ‘థాంక్యూ’ అన్న టైటిల్ ని అనుకుంటున్నరట. దాదాపు ఇదే టైటిల్ ని ఓకే చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట. అంతేకాదు ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్ పూజా హెగ్డే నటించబోతుందని సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక‌ ప్రకటన వెలువ‌డాల్సి ఉంది.

పూజా హెగ్డే కి నాగ‌చైత‌న్య థ్యాంక్యూ ఎందుకంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts