వాళ్ల‌కు రూ.కోటి విరాళాన్ని ప్ర‌క‌టించిన నాగార్జున‌..!!

March 28, 2020 at 5:20 pm

ప్రాణాంతక వైరస్ లేదా కోవిడ్- 19 పెను కలకలం రేపుతోంది. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా దెబ్బ ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. కరోనా వైరస్ అన్నిరంగాలపై ప్రభావం చూపింది. వైరస్ నివారణకు మందు లేకపోవడం.. మ‌రింత ఆదోళ‌న‌కు గురిచేస్తుంది. ఇక ఈ క‌రోనా ర‌క్క‌సిని నియంత్రించేందుకు 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది కేంద్ర ప్ర‌భుత్వం. లాక్ డౌన్‌తో జనమే కాదు రోజువారి కూలీలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో రోజువారి పని చేసే వాళ్లు చాలా మంది ఉంటారు.

పొద్దున్నే షూటింగ్‌కు వచ్చి సాయంత్రానికి వాళ్లు డబ్బులు తీసుకుని వెళ్లిపోతుంటారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు పనులతో పాటు చేతిలో డబ్బులు కూడా లేని పరిస్థితి. అయితే ఇలాంటి ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు `కింగ్` నాగార్జున ముందుకొచ్చారు. తన వంతు సహాయంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. `లాక్‌డౌన్ అనేది భయంకర వాస్తవం, తప్పనిసరి పరిస్థితి.

ఈ విపత్కర సమయంలో సహాయం చేయడానికి ముందుకొచ్చిన నా సహనటులకు అభినందనలు. కరోనా కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికుల కోసం నేను రూ. కోటి రూపాయల విరాళం ప్రకటిస్తున్నాను. మనందరినీ దేవుడు చల్లగా చూస్తాడు. అందరూ ఇళ్లలో సురక్షితంగా ఉండండ`ని నాగార్జున ట్వీట్ చేశారు.

వాళ్ల‌కు రూ.కోటి విరాళాన్ని ప్ర‌క‌టించిన నాగార్జున‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts