కొత్త బిజినెస్ స్టాట్ చేసిన నాని భామ‌..!!

March 15, 2020 at 2:47 pm

శ్రద్ధా శ్రీనాథ్.. ఆమె ఎవ‌రు అనుకుంటున్నారా.. అదేనండీ మ‌న నాని జెర్సీ సినిమాలో న‌టించింది క‌దా. ఈ సినిమాతో తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్. ఇందులో నానికి ప్రియురాలిగా, భార్యగా మెచ్యూరిటి కలిగిన నటనతో మెస్మరైజ్ చేసింది. ఈమె న‌ట‌న‌కు ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలు కూడా ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మకు కన్నడలో మంచి క్రేజ్ ఉంది. అక్కడ వరస సినిమాలు కూడా చేస్తుంది.

క్రేజ్ ఉండగానే నాలుగు రాళ్లు సంపాదించుకుని.. ఆ వెనకేసుకున్న సొమ్ముతో లైఫ్ సెటిల్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా బిజినెస్‌లో చాలా మంది తమ డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్లు కూడా బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు శ్రద్ధా శ్రీనాథ్ కూడా అదే ప‌ని చేసింది. వరస సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ కూడా మొదలుపెట్టింది ఈ బ్యూటీ. చెన్నైలో ‘పర్ సే’ పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభించింది శ్రద్ధా శ్రీనాథ్. అందులో ఫుడ్స్ కంటే కూడా సలాడ్స్ ఎక్కువగా ఉంటాయి.

సమ్మర్ సీజన్ కావడంతో బిజినెస్ కూడా బాగుంటుందని నమ్ముతుంది ఈ ముద్దుగుమ్మ. ఇది రెస్టారెంట్ కంటే కాస్త చిన్నదిగా, కేఫ్ కంటే పెద్దదిగా ఉంటుందట. ఇక్కడ ఆరోగ్యకరమైన ఫుడ్ లభిస్తుందని, దీన్ని ఆదరించాలని శ్రద్ధ కోరుకుంది. ముఖ్యంగా రెగ్యులర్ బర్గర్స్, సాండ్ విచ్ లాంటి ఫుడ్స్ కాకుండా హెల్తీ ఫుడ్ తమ రెస్టారెంట్‌లో ఉంటాయ‌ని ఆమె చెబుతోంది. ఇక‌ సినిమాల్లో తనపై చూపిస్తున్న ప్రేమ తన వ్యాపారంపై కూడా చూపించాలంటోంది శ్రద్ధా.

కొత్త బిజినెస్ స్టాట్ చేసిన నాని భామ‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts