క‌రోనా ఎఫెక్ట్‌తో శ్రుతి హాస‌న్‌కు డిమాండ్ పెరిగింది.. ఎందుకో తెలుసా..?

March 30, 2020 at 12:46 pm

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలు విస్త‌రిస్తూ.. ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడ్డ వారి సంఖ్య 7,22,664 మంది కాగా, 33,983 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,51,793 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఈ లెక్క‌లు చూస్తుంటేనే క‌రోనా ఏ రేంజ్‌లో వ్యాప్తి చెందుతుందో అర్థం అవుతుంది. అయితే క‌రోనా ఎఫెక్ట్‌తో శ్రుతి హాస‌న్‌కు డిమాండ్ పెరుగుతుంది. అవును! మీరు విన్న‌ది నిజ‌మే. ఈ విష‌యం స్వ‌యంగా శ్రుతినే చెప్పింది.

కొన్ని సంవత్సరాల క్రితం తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, హీరో సూర్య కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం `సెవెన్త్ సెన్స్`. చైనా వల్ల వచ్చిన వైరస్ కారణంగా భారతదేశం తీవ్ర ముప్పును ఎదుర్కొంటుంది. ఆ వైరస్ నాశనం చేయ‌డానికి బోధిధర్మని తీసుకురావడం ఒకటే మార్గమని జన్యు పరిశోధకురాలైన శ్రుతి తెలుసుకుంటుంది. ఈ క్ర‌మంలోనే అతని వంశానికి చెందిన హీరోలో జన్యు పరిణామ క్రమం జరిపి వందేళ్ల కిందటి బోధిధర్మని మళ్లీ తీసుకొచ్చి.. వైర‌స్‌ను నాశ‌నం చేసేలా చేస్తుంది.

అయితే ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిస్థితులు ఈ సినిమా చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాలు విస్త‌రిస్తూ.. వేల మంది బ‌లి తీసుకుంటుంది. దీంతో బోధిధర్మని మళ్లీ తీసుకురమ్మంటూ నెటిజన్లందరూ శ్రుతికి మెసేజ్‌లు పెడుతున్నారట. సోషల్ మీడియా ద్వారా శ్రుతి ఈ విషయాన్ని బ‌య‌ట పెట్టింది. ఈ విధంగా శ్రుతికి డియాండ్ పెరుగుతుంద‌న్న‌మాట‌.

క‌రోనా ఎఫెక్ట్‌తో శ్రుతి హాస‌న్‌కు డిమాండ్ పెరిగింది.. ఎందుకో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts