చైనాలో పుట్టుకొచ్చిన మ‌రో కొత్త వైర‌స్.. ఇక‌రు మృతి..!!

March 24, 2020 at 4:59 pm

చైనాలో ఇటీవ‌ల పుట్టుకొచ్చిన క‌రోనా వైరస్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తుంది. ఇప్ప‌టికే ఈ క‌రోనా వైర‌స్ వ‌ల్ల వేల మంది మృతి చెంద‌గా.. ల‌క్ష‌ల్లో దీని బారినప‌డి నానా తంటాలు ప‌డుతున్నారు. మొద‌ట వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ లో కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో కరోనావైరస్‌(కోవిడ్‌-19)గా గుర్తించారు. అయితే వూహాన్.. గత వారం రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

దీంతో ఆ దేశ ప్రభుత్వం కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ లోపే మరో కొత్త వైరస్ డ్రాగన్ కంట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చైనాలోని యువన్ ఫ్రావిన్సులో హంటా వైరస్ లక్షణాలతో ఓ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. షాండాంగ్ ఫ్రావిన్సులకు వెళ్తున్న అతడు హంటా వైరస్‌తో మృతి చెందినట్లు ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. దీంతో ఆయన ప్రయాణించిన బస్సులో 32 మందిని టెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

అయితే ఈ వైరస్ వ్యాప్తికి ఎలుకలే ప్రధాన కారణమని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. ఇంటిలో చుట్టుపక్కల పరిసరాల్లో ఎలుకల వలన హంటావైరస్ వ్యాప్తించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఎలుకల లాలజలం, మూత్రం లేదా దాని వ్యర్థాలను తాకిన తర్వాత ఎవరైనా తమ కళ్లు, ముక్కు, నోటిని తాకితే అది సంక్రమిస్తుందని తెలిపింది.

చైనాలో పుట్టుకొచ్చిన మ‌రో కొత్త వైర‌స్.. ఇక‌రు మృతి..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts