ఏపీ బార్డర్‌కి ఎవరొచ్చినా 2 వారాల క్వారంటైన్..!!

March 26, 2020 at 4:10 pm

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌జల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ భార‌త్‌లోనూ వేగాన్ని పుంజుకుంటుంది. ఇప్ప‌టికే భార‌త్‌లో కరోనా మృతుల సంఖ్య అనధికారికంగా 12కి చేరింది. ఇదిలా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు 35కి చేరాయి. ఢిల్లీలో 24 గంటల్లో 5 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రబలుతున్న ఈ వైరస్ ని అరికట్టడానికి కేంద్రం ఎన్నో చర్యలు తీసుకొంటోంది. ప్రజలు రోడ్ల మీదకు తిరగవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించారు.

అందులో భాగంగా జనతా కర్ఫ్యూని విధించారు. అంతేగాకుండా..ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఏపీ బార్డర్‌కి ఎవరొచ్చినా రెండు వారాలపాటు క్వారంటైన్‌కు పంపిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చ‌రించారు. రెండు వారాల క్వారంటైన్ అనంతరమే తమ రాష్ట్రంలోకి అనుమతిస్తామని ఆయన వెల్ల‌డించారు.

అలాగే బ‌యటి వ్యక్తలను ఏపీలోకి అనుమతించబోమని ఆయన స్ప‌ష్టం చేశారు. క‌రోనా వేగంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని ఆయ‌న సూచించారు. కరోనా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ త‌మ‌కు సహకరించాలని డీజీపీ. లేద‌ని లాక్‌డౌన్‌ను ఉల్లంఘింస్తే క‌ఠ‌న చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ప్ర‌క‌టించారు.

ఏపీ బార్డర్‌కి ఎవరొచ్చినా 2 వారాల క్వారంటైన్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts