ప్రజలకు విజ్ఞప్తి చేసిన తారక్-చరణ్.. దేనికోసమో తెలుసా?

March 16, 2020 at 11:03 pm

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. కాగా ఈ సినిమా షూటింగ్‌కు ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ ప్రభావం తగులుతుందా అని అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కరోనా వైరస్‌కు భయపడకుండా చిత్ర షూటింగ్‌ను నిర్వహించాలని ఆర్ఆర్ఆర్ యూనిట్ భావిస్తోంది.

కాగా తాజాగా కరోనా వైరస్ గురించి ప్రజలను అవగాహన పరుస్తూ తారక్, చరణ్‌లు కలిసి ఓ వీడియో చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కలిగిస్తున్న సూచనలను, సలహాలను ఎట్టిపరిస్థితుల్లో పాటించాలని వారిద్దరు తెలిపారు. కరోనా వైరస్ అంతమయ్యే వరకు షేక్ హ్యాండ్, హగ్ ఇవ్వకుండా ఉండాలని, చేతులను వీలైనన్ని ఎక్కువసార్లు కడగాలని, దగ్గు, తుమ్ములు ఉన్నట్లయితే ఖచ్చితంగా మాస్క్ ధరించాలని వారు సూచించారు.

ప్రభుత్వం అదేశించిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారిన పడకుండా ఉండవచ్చని ఆర్ఆర్ఆర్ హీరోలు తెలపడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఓ సామాజిక అవగాహనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తారక్, చరణ్‌లు చేసిన ప్రయత్నం హర్షనీయం అని పలువురు అంటున్నారు.

ప్రజలకు విజ్ఞప్తి చేసిన తారక్-చరణ్.. దేనికోసమో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts