ట్రిపుల్ ట్రీట్‌కు రెడీ కావాలన్న తారక్!

March 16, 2020 at 8:50 am

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతదేశ ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్‌ను వచ్చే జనవరికి వాయిదా వేయడంతో సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ప్రేక్షకులు ఆసక్తిగా ఫాలో అవుతున్నారు.

కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. కాగా ఈ సినిమాలో చరణ్ పాత్ర కంటే తారక్ పాత్రనే హైలైట్ చేయనున్నారనే వార్త గతకొంత కాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో తారక్ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు విభిన్న షేడ్స్‌లో మనకు కనిపిస్తాడని తెలుస్తోంది.

స్వాతంత్ర పోరాట యోధుడు కొమురం భీం పాత్రలో తారక్ కనిపిస్తాడు. అంతేగాక ఈ సినిమాలో తారక్ ఓ సరికొత్త లుక్‌లో పులితో పోరాడుతున్న ఫోటోలు ఇప్పటికే లీక్ అయ్యి సోషల్ మీడియాలో ఎలాంటి హల్‌చల్ చేశాయో అందరికీ తెలిసిందే. అటు ఈ సినిమాలో కొంత షూటింగ్‌ను గుండుతో చేశాడట తారక్. ఇలా మూడు విభిన్న షేడ్స్‌లో తారక్ కనిపించనున్నాడట.

జక్కన్న సినిమాలో తారక్ ఎలివేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే మూడు సినిమాలు కలిసి నటించిన ఈ కాంబోలో మరో సినిమా రానుండటం, అది వాటికంటే భారీ బడ్జెట్, భారీ క్యాస్టింగ్‌తో వస్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ట్రిపుల్ ట్రీట్‌కు రెడీ కావాలన్న తారక్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts