వకీల్ సాబ్‌లో పవన్ అన్నయ్య.. అవునా అంటోన్న ఫ్యాన్స్?

March 17, 2020 at 7:21 pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. రెండేళ్ల తరువాత పవన్ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమా కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన పింక్ చిత్రానికి ఈ సినిమా రీమేక్‌గా వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

పవన్ కళ్యాణ్ తొలిసారి లాయర్ పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు పవన్ అన్నయ్యను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబును ఓ కీలక పాత్రలో నటించేందుకు వకీల్ సాబ్ రికమెండ్ చేయడంతో చిత్ర యూనిట్ ఆయన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోవడం గమనార్హం. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా థామస్, అంజలి నటిస్తున్నారు. మరి ఈ సినిమాలో నాగబాబు ఉన్నాడా లేడా అనేది తెలియాల్సి ఉంది.

వకీల్ సాబ్‌లో పవన్ అన్నయ్య.. అవునా అంటోన్న ఫ్యాన్స్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts