కేంద్రం,తెలుగు రాష్ట్రాలకి భారీ విరాళం ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!!

March 26, 2020 at 10:11 am

కరోనా వైరస్ లేదా కోవిడ్‌-19 ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌ను తీవ్ర‌ భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4లక్షలపైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం ప్రపంచ దేశాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. పలుదేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. సరిహద్దులు మూసేశాయి. దీంతో వచ్చే ఏప్రిల్ 14వరకు ప్రజలంతా ఇళ్లకు పరిమితం కావాల్సిందే. ఇదిలా ఉంటే.. ప్రముఖ సినీ నటుడు జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇప్ప‌టికే పలువురు ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తమకు చేతనైన సహాయాన్ని అందిస్తున్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు, ప్రధానమంత్రి సహాయనిధికి భారీ విరాళం ప్రకటించారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో తన వంతు సాయంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెరో రూ.50 లక్షల విరాళాన్ని ప్ర‌క‌టించారు.

అంతేకాకుండా, భారత ప్రధాన మంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందిస్తాన`ని పవన్ ట్విటర్ ద్వారా తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తివంతమైన నాయకత్వం కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడుతుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, రెక్కాడితే కానీ డొక్క ఆడని చాలా మంది నిరుపేదలు లాక్‌డౌన్ సందర్భంగా పనిలేకుండా పోయింది. వీరిని ఆదుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సినీ నటులు తమ వంతు సామాజిక బాధ్యతగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

కేంద్రం,తెలుగు రాష్ట్రాలకి భారీ విరాళం ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts