వకీల్ సాబ్‌పై గుర్రమంటున్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

March 20, 2020 at 10:07 am

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో పవన్ మరోసారి తన సత్తాను బాక్సాఫీస్‌కు చూపించాలని రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు ఈ సినిమా రీమేక్‌గా వస్తుండటంతో ఈ సినిమా అదిరిపోయే రీతిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలోపవన్ సరసన ఓ హీరోయిన్‌ను పెడదామని చిత్ర యూనిట్ భావిస్తోంది.

దీంతో పవన్ సరసన లావణ్య త్రిపీఠీని హీరోయిన్‌గా సెలెక్ట్ చేశారట చిత్ర యూనిట్. అయితే ఈ నిర్ణయం పట్ల పవన్ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ లాంటి క్రేజ్ ఉన్న హీరో పక్కన ఇలాంటి చిన్న హీరోయిన్ ఏమిటని వారు అంటున్నారు. ఈ విషయం నిర్మాత దిల్ రాజు వరకు చేరడంతో లావణ్య స్థానంలో వేరే స్టార్ బ్యూటీని తీసుకునే పనిలో పడ్డారట చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండగా ఫీమేల్ లీడ్ పాత్రల్లో నివేదా థామస్, అంజలి నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి పవన్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే అంశం మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో చాలా ఆసక్తికరంగా మారింది.

వకీల్ సాబ్‌పై గుర్రమంటున్న ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts