పూజాకి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ..?

March 30, 2020 at 2:29 pm

ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవ‌రంటే పూజా అనే చెప్పాలి. ఏ సినిమాలో చూసినా పూజానే క‌నిపిస్తుంది. వ‌రుస విజ‌యాల‌తో అవ‌కాశాల‌ను అందుకుంటూ ముందుకు దూసుకు వెళుతుంది ఈ భామ‌. ఇక జయాపజయాల సంగతి అటుంచితే, ప్ర‌స్తుతం ఈ భామ సూర్య వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అలా ప్రస్తుతం ఆయన ‘అరువా’ చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరైన హరి, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించారు. చివరికి పూజ హెగ్డేను తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

దాదాపు ఆమె ఎంపిక ఖరారైపోయిందనే అంటున్నారు. ఇప్పటికే పూజ హెగ్డే తెలుగులో తన జోరును కొనసాగిస్తోంది. ఇప్పటికే పూజ హెగ్డే తెలుగులో తన జోరును కొనసాగిస్తోంది. త్వరలోనే రానున్న అఖిల్ సినిమా .. ప్రభాస్ సినిమాలు ఆమె క్రేజ్ ను మరింత పెంచుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడేమో తమిళంలో సూర్య సరసనే ఛాన్స్ కొట్టేసింది. ఇక కోలీవుడ్లోను పూజ హవా కొనసాగుతుందేమో చూడాలి. ఆల్రెడీ బాలీవుడ్‌లో కూడా దాదాపు ఈమె జండా పాతేసిన‌ట్టే. అగ్ర‌క‌ధానాయ‌కుల‌తో న‌టిస్తూ అక్క‌డ కూడా కొన‌సాగుతుంది.

పూజాకి మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts