చివరకి పూజకి కూడా అలాంటి పాత్రలే కావాలంట..?

March 16, 2020 at 4:49 pm

ప్ర‌స్తుతం మంచి టాప్ ప్లేస్ లో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. ఏ హీరోతో చూసినా పూజాహెగ్డేనే క‌నిపిస్తుంది. గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌తో కుర్ర‌కారుని హీటెక్కిస్తుంది. ఇటీవ‌లె ఈ భామ అల‌వైకుంఠ‌పురంలో న‌టించి మెప్పించింది. ఇక ఈ అగ్ర‌క‌థానాయిక‌లు గ్లామరస్ పాత్రలతో పాటు ఛాన్స్ చిక్కినప్పుడల్లా తమలోని నటిని బ‌య‌ట‌కు తీసుకువ‌స్తున్నారు. అనుష్క- నయనతార- సమంత- పాయల్ రాజ్‌పుత్‌ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నారు. మిగిలిన హీరోయిన్లు ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వీరి జాబితాలో గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే కూడా చేరబోతుంది. త్వరలో బుట్ట బొమ్మ ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించబోతున్నట్టు స‌మాచారం.

ఇటీవల `అల వైకుంఠపురములో`తో బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఈ బుట్టబొమ్మ ఇప్పుడు ప్రభాస్ సరసన జాన్ చిత్రంలో నటిస్తుంది. దీనికి రాధాకృష్ణ దర్శకుడు. దీంతోపాటు ప్ర‌స్తుతం ఈ భామ అఖిల్ తో క‌లిసి`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్..లో అలాగే త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్ చిత్రంలోనూ నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా పూజాకి ఓ ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. గ్లామరస్ పాత్రలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మకి లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఆఫర్ వచ్చిందట.

దర్శకుడు హను రాఘవపూడి ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందించేందుకు క‌థ‌ను రెడీ చేసుకుంటున్నాడ‌ట‌. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకునే ఆలోచనలో హను ఉన్న‌ట్లు స‌మాచారం. తన పాత్రకి ఆమె అయితేనే బాగా సూట్ అవుతుందని భావిస్తున్నారు. పూజాని ఈ విషయంపై సంప్రదించగా.. తాను ఒప్పుకున్న‌ట్లు స‌మాచారం. అయితే అధికారికంగా పూర్తి క్లారిటీగా పూజా ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉందట. ఇదే నిజమైన తొలిసారి పూజాని ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో చూసే ఛాన్సుంది అభిమానులకు. మరి ఈ గ్లామర్ భామ అస‌లు అలాంటి పాత్ర‌ల‌కి సూట్ అవుద్దా అన్న అనుమానాలు కూడా మ‌రో ప‌క్క వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

చివరకి పూజకి కూడా అలాంటి పాత్రలే కావాలంట..?
0 votes, 0.00 avg. rating (0% score)