చిరు కండీష‌న్స్ పెడితే…ప్ర‌భాస్ పాటిస్తాడా?

March 17, 2020 at 11:24 am

ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ తో ఇప్పుడు అంద‌రూ భ‌యభ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. అక్క‌డా.. ఇక్క‌డా.. అని లేకుండా ప్ర‌పంచంలో ఉన్న అన్ని దేశాల‌ను చుట్టుముట్టేస్తుంది. చాప‌కింద నీరులా ప్ర‌తీ దేశాన్నీ చుట్టేస్తోంది. దీంతో ప్ర‌పంచ దేశాల‌న్నీ హెల్త్ ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టించేశాయి. దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అంతా సంఘ‌టితం కావాల‌ని, ఈ స‌మ‌యంలో అంతా సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌ధాని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. రెండు వారాల పాటు సినిమా థియేట‌ర్స్‌, మాల్స్ అన్నీమూసివేయాల‌ని ఇప్ప‌టికే అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.

ఇదిలా వుంటే సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లంద‌రూ కూడా ఎంతో బాధ్య‌త‌గా షూటింగ్‌ల‌ని ఆపేస్తున్నామంటూ ప్ర‌క‌టించేసింది. ముందుగా మెగాస్టార్ చిరంజీవి త‌న సినిమా షూటింగ్‌ని ఆపేస్తున్నాన‌ని, అంతా త‌న లాగే కార్మికుల శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకుని షూటింగ్‌లు ఆపేసి అంతా స‌హ‌కరిస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు. ఆ త‌రువాతే `మా` తో పాటు నిర్మాతల మండ‌లి ముందుకొచ్చి టోట‌ల్ షూటింగ్స్ మొత్తం ఆపేస్తున్నామంటూ ప్ర‌క‌టించాయి. అయితే అవుట్‌ డోర్‌లో షూటింగ్ చేస్తున్న వారి నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. పైగా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న ఇట‌లీలో షూటింగ్ చేస్తున్న ప్ర‌భాస్ నుంచి ఎలాంటి సందేశం రాక‌పోవ‌డంతో అంతా అవాక్వుతున్నార‌ట‌.

ప్ర‌భాస్ సినిమా కోసం ప్రాణాల‌తో చెల‌గాటం ఆడ‌టం ఎంత వ‌ర‌కు సంమంజ‌స‌మంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతుంద‌ని, స్టార్స్ డేట్స్ అయిపోతాయ‌ని, దాంతో బ‌డ్జెట్ ఎక్క‌డ పెరిగిపోతుందోన‌ని ప్రాణాల‌ని ప‌ణంగా పెట్టి మ‌రీ షూటింగ్ చేయ‌డం ప్ర‌భాస్ పూనుకోవ‌డం ఎలాంటి విప‌త్క‌ర ప‌రిణామాల‌కు దారితీస్తుందోనిని ఇండస్ట్రీ వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. మ‌రి దీని పైన ఆయ‌న ఎలాంటి నిర్న‌యం తీసుకుంటారో వేచి చూడాలి.

చిరు కండీష‌న్స్ పెడితే…ప్ర‌భాస్ పాటిస్తాడా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts