సినీ తారల విరాళాలలో అల్ ఇండియా రికార్డు ప్రభాస్ దే!

March 28, 2020 at 1:44 pm

ప్రస్తుతం యావత్ ప్రపంచదేశాలు అన్ని కూడా కరోనా మహమ్మారి దెబ్బకు భయంతో వణికిపోతున్నాయి. ఈ భయంకర వ్యాధి మరింతగా వ్యాప్తి కాకుండా ఉండాలని భావించి, పలు దేశాలు ఇప్పటికే ప్రజలను పూర్తిగా ఇళ్లకు పరిమితం చేసి లాకౌట్ లు ప్రకటించాయి. ప్రతి ఒక్క వ్యక్తి సోషల్ డిస్టెన్స్ పాటించి, కొన్ని వారాల పాటు తమ ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉంటేనే ఈ మహమ్మారిని త్వరగా తరిమి కొట్టవచ్చని ఆ విధంగా చేయడం జరిగింది. అయితే లాకౌట్ల వలన కోట్లాది మంది ప్రజలు ఉపాధి లేక తినడానికి తిండి లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుండడంతో ఆయా దేశ ప్రభుత్వాలు కొంత ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించి పేద, దిగువ తరగతి వర్గాలకు చేయూతను అందిస్తున్నాయి.

 

 

ఇక మనదేశంలో కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించగా, మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మరికొంత మొత్తాన్ని ప్రజలకు అందించేందుకు సిద్ధం అయ్యాయి. అయితే ప్రజలకు ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా ఆదుకోవడంలో ముందుండే సినిమా పరిశ్రమ వారు, మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ ప్రముఖులు, ఈ సారి కూడా భారీ మొత్తాలలో విరాళాలు ప్రకటించి తమ గొప్ప మనసుని చాటుకున్నారు. అయితే అందరికంటే ఒకింత భారీగా, అనగా ఏకంగా రూ.4 కోట్ల విరాళాన్ని ప్రకటించారు రెబల్ స్టార్ ప్రభాస్. అందులో రూ.3 కోట్లు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు అలానే, రూ.50 లక్షల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు ఆయన అందించడం జరిగింది.

 

 

అయితే ఇప్పుడు ప్రభాస్ చేసిన ఈ గొప్ప పని, దేశవ్యాప్తంగా ఉన్న సెలెబ్రిటీలను, ముఖ్యంగా బాలీవుడ్ బడా స్టార్స్ కి సైతం పెద్ద షాక్ ఇచ్చింది. అయితే బాలీవుడ్ నుండి కరోనా బాధితులను ఆదుకోవడానికి ఇప్పటివరకు హృతిక్ రోషన్ రూ.50 లక్షలు, కపిల్ శర్మ రూ.50 లక్షలు ప్రకటించడం జరిగింది. కాగా అందుతున్న సమాచారం ప్రకారం, ప్రభాస్ సాయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు బాలీవుడ్ బడా స్టార్స్ అతి త్వరలో విరాళాలు ప్రకటించేలా ఆలోచన చేస్తున్నారట…..!!

సినీ తారల విరాళాలలో అల్ ఇండియా రికార్డు ప్రభాస్ దే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts