మరొక రూ.50 లక్షలు ప్రకటించిన ప్రభాస్…..!!

March 30, 2020 at 4:30 pm

ప్రజలకు ఎటువంటి కష్టం, లేదా విపత్తు సంభవించినా మేము కూడా వారికి సాయపడడానికి సిద్ధం అంటూ ఎప్పుడూ ముందుండే సినిమా పరిశ్రమ వారు, మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుండి ఇప్పటికే కరోనా మహమ్మారి తో అల్లల్లాడుతున్న ప్రజలకు తమకు వీలైనంత సాయాన్ని అందిచడం జరిగింది. ఓవైపు ఈ వ్యాధి తీవ్రత మరింతగా ప్రభల కుండా మన దేశం సహా పలు దేశాలు సైతం పూర్తిగా తమ ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తూ లాకౌట్ ప్రకటించడం జరిగింది.

 

 

అయితే దీనివలన పేద, దిగువ తరగతి వర్గాల ప్రజలకు జీవనోపాధి లేక అటువంటి వారికి పూట గడవడం కష్టం అయింది. దీనితో మన కేంద్ర ప్రభుత్వం తో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రజలకు ఆర్ధిక ప్యాకెజీ లు ప్రకటించాయి. అయితే మేము కూడా మా వంతుగా సాయం అందిస్తాం అని ముందుకు వచ్చిన టాలీవుడ్ నుండి రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే రూ. 4 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అందులో రూ.50 లక్షల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు, అలానే  రూ.3 కోట్లు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు ఆయన అందించడం జరిగింది.

 

 

ఇకపోతే కాసేపటి క్రితం మరొక రూ.50 లక్షలను కరోనా విపత్తు నిధికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రభాస్ ప్రకటించడం జరిగింది. కాగా ఇప్పటికే టాలీవుడ్ లో అందరికంటే అత్యధిక మొత్తం విరాళంగా ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచి తన గొప్ప మనసుని చాటుకున్న ప్రభాస్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటువంటి ఆపద సమయంలో ప్రజలను ఆదుకోవడం తమ బాధ్యత అని, తమకు ఇంతటి ఉన్నత స్థాయిని అందించిన ప్రజలకు తనవంతుగా సాయం అందించడం ఆనందంగా ఉందని ప్రభాస్ అంటున్నారు….!!

మరొక రూ.50 లక్షలు ప్రకటించిన ప్రభాస్…..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts