స్వీటీ శెట్టి.. అనుష్క శెట్టిగా ఎలా మారిందో తెలుసా..?

March 13, 2020 at 3:43 pm

అనుష్క శెట్టి అలియాస్ స్వీటీ శెట్టి.. ఈమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సూపర్‌ మూవీతో సినిమా కెరీర్‌ను మొదలుపెట్టి.. ఆ తర్వాత విక్రమార్కుడు, అరుంధతి, బాహుబలి, భాగమతి సినిమాలతో సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిన అనుష్క శెట్టి సినీ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. చిత్ర సీమలో ప్రవేశించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న అనుష్క‌.. ప్ర‌స్తుతం ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న ‘నిశ్శ‌బ్దం’ ఏప్రిల్ 2న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అలాగే అనుష్క 15 ఏళ్ల కెరీర్ ఈవెంట్‌ను చిత్ర బృందం గురువారం హైద‌రాబాద్‌లోఘనంగా నిర్వ‌హించింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి అనుష్కశెట్టితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అనుష్కశెట్టిని వెండితెరకు పరిచయం చేసిన పూరీ జగన్నాథ్.. అందరి ముందే ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట పెట్టారు. అంతేకాదు, స్వీటీ శెట్టి పేరును అనుష్కగా ఎలా మార్చారన్న విషయాన్ని కూడా వెల్లడించాడు పూరి.

అందరు ఎంతో ముద్దగా పిలిచే స్వీటీనే అనుష్క శెట్టి అసలు పేరట. సూపర్ సినిమా చేసేటపుడు హీరో నాగార్జున మంచి స్క్రీన్ నేమ్ ఉంటే బాగుంటుంద‌ని సలహా ఇచ్చాడట. దాంతో పూరీ జగన్నాథ్.. అపుడే ఈ సినిమాలో ఒక పాట పాట పాడటానికి వచ్చిన సింగర్ పేరు అనుష్క కావడంతో ఆ పేరునే స్వీటీకి పెట్టాలని డిసైడ్ అయ్యాడట. అలా స్వీటీ శెట్టి కాస్తా అనుష్క శెట్టిగా మారింది అని చెప్పుకొచ్చాడు పూరి.

స్వీటీ శెట్టి.. అనుష్క శెట్టిగా ఎలా మారిందో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts