కరోనా కట్టడికి జ‌క్క‌న్న ఏం ఇస్తున్నాడో తెలుసా..?

March 29, 2020 at 5:19 pm

క‌రోనా.. క‌రోనా.. క‌రోనా.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే ప‌దం వినిపిస్తుంది. ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేసిన క‌రోనా వైర‌స్ థాటికి ప్ర‌జ‌ల విల‌విల‌లాడుతున్నారు. అయితే కరోనా వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కరోనా వైరస్ నిర్మూలనకు, తిండిలేక ఇబ్బందుల పడుతున్న వారికి సాయం చేసేందుకు టాలీవుడ్ నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కొండంత కష్టంలో తమకు చేతనైన సాయం చేస్తూ చేయూతగా నిలుస్తున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు.

ఇప్పటికే చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నితిన్‌, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఇలా ఎంద‌రో టాలీవుడ్‌ హీరోలతో పాటు దర్శకులు, నిర్మాతలు తమకు తోచిన సాయం చేస్తున్నారు. అయితే ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి నుంచి అలాంటి ప్రకటన ఏదీ రాలేదు. దాంతో అభిమానులతో పాటు మీడియా కూడా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు జ‌క్క‌న్న‌. ప్రస్తుతం ఇంట్లోనే ఉండి దేశసేవ చేయాల్సిన సమయం వచ్చేసింది.. అదే చేయాలి.. చేస్తున్నారు కూడా అని చెప్పాడు ఈయ‌న‌జ‌

అలాగే ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసులు, వైద్యులు, నర్సులు చేస్తున్న సేవలకు మనం రుణపడిపోయాం. వాళ్లకు పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్విప్మెంట్స్ చాలా అవసరం అవుతాయి.. వాటిని రీ సైకిల్ చేసుకుని వాడుకోడానికి కూడా ఉండదు కాబట్టి అవి దొరకడం కూడా కష్టమవుతున్నాయి. అందుకే తమ టీం అంతా కలిసి భారీగా ఫేస్ మాస్కులతో పాటు ప్రొటెక్టర్స్ కూడా అందించబోతున్నామని జ‌క్క‌న్న చెప్పుకొచ్చారు.

కరోనా కట్టడికి జ‌క్క‌న్న ఏం ఇస్తున్నాడో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts