ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన్న చేయబోయే సినిమా తెలుసా?

March 17, 2020 at 5:36 pm

బాహుబలి వంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించి తన ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో కలిసి ఆయన ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.

ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే రాజమౌళి తన నెక్ట్స్ మూవీ ఏ స్టార్ హీరోతో, ఎంత బడ్జెట్‌తో తెరకెక్కిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం జక్కన్న తన నెక్ట్స్ మూవీని చాలా తక్కవ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్టు పనులు కూడా ఇప్పటికే పూర్తవుతున్నాయని చిత్ర వర్గాలు అంటున్నాయి.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును పూర్తి చేయవచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి రాజమౌళి అందరికీ షాకిస్తూ తన నెక్ట్స్ మూవీని చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఆ సినిమాలో హీరోహీరోయిన్లు ఎవరనే అంశం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద సస్పెన్స్‌గా మారింది. మరి ఈ ప్రశ్నకు జవాబు ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.

ఆర్ఆర్ఆర్ తరువాత జక్కన్న చేయబోయే సినిమా తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts