మళ్లీ ఉత్తదే అంటోన్న జక్కన్న.. ఏమిటో ఈ హైరానా?

March 20, 2020 at 11:34 am

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయకపోవడంతో ఫ్యాన్స్ చాలా నిరాశకు లోనవుతున్నారు. ప్రతి పండగకు ఈ సినిమా నుండి ఏదో ఒక పోస్టర్ వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

కానీ ఏ ఒక్క పండగకు కూడా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయలేదు. దీంతో మార్చి 27న ఈ సినిమాలోని రామ్ చరణ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తారని అందరూ భావించారు. కానీ ఈసారి కూడా రాజమౌళి ప్రేక్షకులను నిరాశ పర్చడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళనలు ఏర్పడటంతో ఇలాంటి సమయంలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం తగదని రాజమౌళి భావిస్తున్నాడు.

దీంతో ఈసారి కూడా ఆర్ఆర్ఆర్ నుండి నిరాశే ఎదురవుతుందని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. మరి ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తుండగా కొమురం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

మళ్లీ ఉత్తదే అంటోన్న జక్కన్న.. ఏమిటో ఈ హైరానా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts