చిరు సినిమాతో చ‌ర‌ణ్ పాత్ర ఎలా ఉంటుందో తెలుసా..?

March 26, 2020 at 8:01 am

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహ రెడ్డి చిత్రం తర్వాత కొర‌టాల శివ‌తో ఆచార్య‌ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇక గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతున్న షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కూడా ఉందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ పాత్రలో మహేష్ నటిస్తాడని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే చివరకు రామ్‌చరణ్‌నే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది.

మ‌రియు ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే చెర్రీ పాత్ర సినిమాను మలుపు తిప్పుతుందట. ఈ పాత్ర స్ఫూర్తితోనే ఆచార్య తన గమ్యాన్ని ఏర్పరచుకుంటాడట. ఇక సినిమాలో దాదాపు 30 నిమిషాలపాటు చెర్రీ క్యారెక్టర్ ఉంటుందట. చెర్రీ కోసం ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా కొరటాల ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా చిరంజీవి, రామ్‌చరణ్ మీద ఓ పాటను కూడా చిత్రీకరించబోతున్న‌ట్టు తెలుస్తోంది.

చిరు సినిమాతో చ‌ర‌ణ్ పాత్ర ఎలా ఉంటుందో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts