ఉగాది పచ్చడా.. ఒళ్ళంతా పచ్చడా.. వర్మ సెటైర్లు..!!

March 25, 2020 at 8:35 am

ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. మనం ఈ రోజు వికారి నామ సంవత్సరంలోంచి శ్రీశార్వరి నామ సంవత్సరంలోకి అడుగిడుతున్నాము. ఇక ఉగాది వస్తోందంటే చాలు వేప పచ్చడీ, పంచాంగ శ్రవణమే గుర్తుకుస్తాయి. అయితే ఈ సారి కరోనా వైర‌స్‌ దెబ్బకు ఏ ఆలయానికి వెళ్లలేని పరిస్థితి. సామాజిక దూరం పాటిస్తూ, ఇంట్లోనే ఉంటూ ఉగాది చేసుకోవాలి. ఇదిలా ఉంటే.. కరోనా కట్టడి నిమిత్తం దేశంలోని పలు రాష్ట్రాలు సహా ఏపీ, తెలంగాణలలో లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా, రవాణా ఆంక్షలు కట్టుదిట్టంగా అమలవుతున్నాయి. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే కనిపిస్తే కాల్చివేయండి అనే ఆర్డర్స్ కూడా జారీ చేశారు. అయినాసరే, మొండికేసి బయటకెళుతున్న వారు లేకపోలేదు. అయితే ప్రభుత్వాలు చేసిన ఈ ఆర్డర్స్‌పై పోలీసువారు హెచ్చరిస్తున్నట్లుగా రిథమింగ్ పదాలతో కొన్ని మెసేజ్‌లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

ఈ రిథమింగ్ వర్డ్స్‌ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా పోస్ట్ చేయడం విశేషం. `ఉగాది పచ్చడి కావాలంటే ఇంట్లో ఉండండి. ఒళ్లంతా పచ్చడి కావాలంటే బయటకు రండి’ అనేది పోలీస్ హెచ్చరిక అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు సైతం త‌మ‌దైన స్టైల్‌లో కామెంట్లు పెడుతున్నారు.

ఉగాది పచ్చడా.. ఒళ్ళంతా పచ్చడా.. వర్మ సెటైర్లు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts