క‌రోనాపై వ‌ర్మ పోస్ట్‌.. చైనాపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు..!!

March 28, 2020 at 10:48 am

చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్‌(కోవిడ్-19) ప్ర‌స్తుతం ఏ రేంజ్‌లో విస్త‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ వైర‌స్ వ‌ల్ల రోజురోజుకు మృతుల‌ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టికే ఈ వైరస్‌ బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా 27,250 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 5.94 లక్షల మందికిపైగా ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా బాధితుల్లో అమెరికా చైనాను దాటేసిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యంలో 83,338 మందికిపైగా కోవిడ్ బారిన పడగా.. 1321 మంది చనిపోయారు.

ఇదిలా ఉంటే.. రామ్ గోపాల్ వర్మ ఎప్ప‌టిక‌ప్పుడు క‌రోనా వైర‌స్‌పై త‌న‌దైన శైలిలో స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అది ఎలాంటి సందర్భమైనా, ఎవ్వరు ఏమనుకున్నా తన మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఒక్క వర్మకే సాధ్య‌మ‌వుతుంది. ఇక తాజాగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో కరోనా వైరస్ పై ఆసక్తికరమైన పోస్ట్ పెట్టి అందరిని ఆకట్టుకున్నారు.

ఆ పోస్ట్ అర్ధం ఏంటంటే.. చైనా ‘కోవిడ్ 19’ అనే గ్రూప్ ను క్రియేట్ చేసి.. అందులో ప్రపంచం మొత్తాన్ని యాడ్ చేసి తను ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అవుతుండగా.. నెటిజన్లు చైనా కుట్రపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, ఇప్ప‌టికే ఈ వైరస్ పై సోషల్ మీడియాలో వవేలాది జోక్స్, మీమ్స్ వచ్చిపడుతున్నాయి. మ‌రియు ఎవరికి వారు తమ క్రియేటివిటీని జోడించి సృజనత్మకతంగా చైనాను ఏకిపారేస్తున్నారు.

క‌రోనాపై వ‌ర్మ పోస్ట్‌.. చైనాపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts