రాజమండ్రి జైలులో రవితేజ.. రీజ‌న్ అదేనా..!!

March 15, 2020 at 1:04 pm

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం క్రాక్‌. డాన్‌ శీను, బ‌లుపు లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా ఇది. దీంతో తాజా చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి ఇటీవల టీజర్ విడుదలై మంచి స్పంద‌న ద‌క్కించుకుంది.

ప్రస్తుతం ఈ చిత్రం రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ సెంట్రల్ జైలుకి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తోంది చిత్రృందం. క్రాక్ సంబందించి ఇదే లాస్ట్ షెడ్యూల్. దీంతో ఏప్రిల్ 2 వరకు అక్కడే షూటింగ్ జరగనుంది. దీంతో టాకీ పూర్తవుతుంది. అంతే ప్ర‌స్తుతం ర‌వితేజ షూటింగ్ నిమ్మ‌త్తం రాజ‌మండ్రి జైలులో ఉన్నాడ‌న్న‌మాట‌.

ఇక రవితేజ ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఏపీలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇక అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని 2020 సమ్మర్ లో విడుదల‌ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కాగా, ర‌వితేజకు ఇది 66వ చిత్రం. ఇక రవితేజ నటించిన డిస్కో రాజా ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని చూస్తున్నారు ఈ మాస్ మ‌హారాజా.

రాజమండ్రి జైలులో రవితేజ.. రీజ‌న్ అదేనా..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts