రైటర్ కమ్ డైరెక్టర్ ని నమ్ముకున్న రవితేజ!

March 14, 2020 at 11:28 am

వ‌క్కంతం వంశీ ఈ పేరు తెలియ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. చాలా సినిమాల‌కు ప‌ని చేశాడు. ఇక ర‌చ‌యిత‌గా మంచి విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈయ‌న రాసిన క‌థ‌ల‌తో ఎంతో మంది ద‌ర్శ‌కులు హిట్ కొట్టారు. క‌లుసుకోవాల‌ని, అశోక్‌, అతిథి, కిక్‌, క‌ల్యాణ్‌రామ్ క‌త్తి, ఊస‌ర‌వెల్లి, ఎవ‌డు, రేసుగుర్రం, టెంప‌ర్ వ‌ర‌కు వంశీ క‌థ అందించిన సినిమాల్లో దాదాపు హిట్‌లే అని చెప్పాలి. అయితే స‌డెన్‌గా ఎందుకో ఆ త‌రువాతే అత‌ని ఫేట్ మారింది. వ‌రుస ఫ్లాపులొచ్చాయి. ఎప్పుడైనా స‌రే ఎప్పుడూ జీవితం ఎవ్వ‌రికీ ఒకేలాగా సాగ‌దు. అప్స్ అండ్ డౌన్స్ అన్న‌వి చాలా స‌ర్వ‌సాధార‌ణం.

ఆయ‌న ద‌ర్శ‌కుడిగా చేసిన తొలి సినిమా `నా పేరు సూర్య‌` అల్లు అర్జున్ కెరీర్‌లోనే పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా త‌రువాత అతనికి మ‌రో సినిమా ఇవ్వ‌డానికి హీరోలు ఎవ‌రూ ముందుకు రాలేద‌నే చెప్పాలి. కానీ మాస్ మ‌హారాజా ర‌వితేజ మాత్రం ముందుకొచ్చాడు. అయితే అత‌ని ప‌రిస్థితీ ఇంచుమించు ఇలాగే వుంది. దాంతో ఆయ‌న ముందుకు వ‌చ్చి సినిమాని ఇచ్చి వ‌క్కంతం వంశీకి అవ‌కాశం ఇచ్చాడు ర‌వితేజ‌. మ‌రి వ‌క్కంతం ఈసారైనా మెప్పిస్తాడా? అన్న‌ది అత‌ని చేతుల్లోనే వుంది. ఈ సారి క‌నుక‌ ఆక‌ట్టుకోలేక‌పోతే వ‌క్కంతం వంశీకి మ‌రో అవ‌కాశం ద‌క్క‌డం అనేది చాలా క‌ష్టం అని చెప్పాలి.

రైటర్ కమ్ డైరెక్టర్ ని నమ్ముకున్న రవితేజ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts