కుర్రాళ్ళ‌కి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న రెజీనా…అంతా చిరు వ‌ల్లే?

March 26, 2020 at 4:39 pm

రెజీనా తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి. రెజినా కెసాండ్రా… ఎంత గ్లామర్ గా ఉంటుందో, ఎంత హాట్ అండ్ సెక్సీగా ఉంటుందో తనని బాగా ఫాలో అయ్యోవాళ్ళకి, తన అభిమానులకి బాగా తెలుసు. అద్భుతమైన ఫిజిక్ తో కొన్నాళ్ళు టాలీవుడ్ లో అదరగొట్టింది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఎస్.ఎం.ఎస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. చెన్నైలో పుట్టి పెరిగి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. రెజీనా సినిమాల మీద ఆసక్తితో ముందు తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాతే తెలుగులో ఎస్ఎంఎస్ సినిమాతో తన సినీ కెరీర్ ని ప్రారంభించింది.

ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన రొటీన్ లవ్ స్టోరీ, మాస్ మహా రాజ రవితేజ తో పవర్, మెగా హీరో సాయి ధరం తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో హిట్స్ ని అందుకుంది. ఈ సినిమాల సక్సెస్ ల‌తో రెజీనా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారు. అందుకు కారణం ఫస్ట్ సినిమా నుండి గ్లామర్ షోకి, రొమాన్స్ కి ఎంతమాత్రం వెనుకాడలేదు. అది క్లియర్ గా క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నక్షత్రం, మిస్టర్ చంద్రమౌళి సినిమాలలో అర్థమైంది. కాని ఈ సినిమాలు రెజీనాకి సక్సస్ ని ఇవ్వలేదు.

దాంతో రెజీనా కెరీర్ లో వెనకబడిపోయింది.ఆ త‌ర్వాత అడవి శేష్‌తో చేసిన చిత్రం ఎవ‌రులో మ‌రింత గ్లామ‌ర్ గా న‌టించింది. అయితే అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ‘ఆచార్య’ సినిమా ఐటమ్ సాంగ్ లో ఈ భామ చిరుతో క‌లిసి చిందేసి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఇదే ఊపుతో మళ్ళీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఛాన్సులు దక్కించుకునేందుకు సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతుంది. రీసెంట్ గా రెజీనా ని చూసిన వాళ్ళకెవరికైనా చమటలు పట్టాల్సిందే. అంతగా తన అందాలను ఆరబోస్తూ కైపెక్కిస్తుంది. మ‌రి ఇంత‌లా రెచ్చ‌పోవ‌డానికి అస‌లు కార‌ణం చిరునేఅట‌.

కుర్రాళ్ళ‌కి చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న రెజీనా…అంతా చిరు వ‌ల్లే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts